నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి
న్యూస్తెలుగు/వనపర్తి : జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. బుధవారం కొత్తకోట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్తకోట జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో సి బి ఎఫ్ నిధులతో నిర్మిస్తున్న ఆరు అదనపు తరగతి గదులు, బాలికల పాఠశాలలో డి ఎం ఎఫ్ టి నిధులతో నిర్మిస్తున్న రెండు తరగతి గదులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా, పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి జెడ్పిహెచ్ఎస్ లో డి ఎం ఎఫ్ టి నిధులతో నిర్మిస్తున్న రెండు మరుగుదొడ్లను కూడా నిలాఖరులోపు పూర్తి చేయాలన్నారు.జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోవిందు నాయక్, కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు, పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మీ, పంచాయతీరాజ్ ఏఈలు నరేష్, కార్తీక్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.(Story : నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి)