ఉపాధ్యాయ సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా..
న్యూస్ తెలుగు/ సాలూరు : ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలకు మధ్య వారిదిలా ఉంటూ ఉపాధ్యాయ సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు అన్నారు తొలిసారిగా ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత ఆయన మంగళవారం సాలూరు పట్టణానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఆత్మీయ కలయికను వేద సమాజం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సమావేశమునకు వివిధ పాఠశాలల నుండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులుప్రధానోపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు ని అభినందిస్తూ దుస్సాలువులతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసల నాయుడు మాట్లాడుతూ గత రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవం దృష్టిలో పెట్టుకొని అన్ని ఉపాధ్యాయ సంఘాలు నాకు ఓటు వేసి గెలిపించినందుకు వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. ఉపాధ్యాయులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా అటు ప్రభుత్వానికి ఇటు ఉపాధ్యాయ సంఘాలకు మధ్య వారదిలా పని చేస్తానని అన్నారు. ఉపాధ్యాయులకు రావలసిన పి ఆర్ సి ,ఐ ఆర్, ఏరియర్స్ పెండింగ్ లో ఉన్న డి ఏ లను ప్రభుత్వంతో మాట్లాడి ఉపాధ్యాయులకు వచ్చేటట్లు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని అన్ని పాఠశాలల నుండి అన్ని మేనేజ్మెంట్లనుండి ఉపాధ్యాయులు అధ్యాపకులు హాజరయ్యారు. నా విజయానికి సహకరించిన గున్న రాజుతో పాటుగా నాకు సహకరించిన మిత్ర బృందం సూర్యనారాయణ తిరుపతి నాయుడు రాము నాయుడు నాలి చంద్రశేఖర్ పైడిరాజు.. ప్రకాష్ వీరందరికీ పి ఆర్ టి యు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని శ్రీనివాసల నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సాలూరు గ్రామ దేవత అయినా శ్రీ శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. (Story : ఉపాధ్యాయ సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా..)