ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం
పల్నాడు డి.పి.టి.ఓ. మధు
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటమే తమ లక్ష్యమని పల్నాడు జిల్లా ఆర్టీసీ డిపిటిఓ. ఎం. మధు అన్నారు. జిల్లా డిపిటివో గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మధు మంగళవారం వినుకొండ ఆర్టిసి డిపోను సందర్శించారు. జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు పరిశీలించే క్రమంలో వినుకొండ వచ్చినట్లు ఆయన విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం అధికంగా పల్లె వెలుగు బస్ సర్వీసులు నడుపుతున్నప్పటికీ. భారీ నష్టాలు వస్తున్నాయన్నారు. వినకొండ డిపో 11 కోట్లు నష్టాల్లో ఉందని. నష్టాన్ని అధిగమించేందుకు అధికారులు, కార్మికులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హయ్యర్ బస్ డ్రైవర్లు, ఆర్టిసి కండక్టర్లను చులకన భావంతో చూస్తున్నారని ఆర్.ఎం. దృష్టికి ఓ విలేఖరి తీసుకువెళ్లగా వాస్తవమేనని అలా జరగకుండా హయర్ బస్సు డ్రైవర్లపై నిఘా పెట్టి వారి వ్యవహార శైలిని గమనించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ లో పారిశుధ్యం అధ్వానంగా మారిందని ప్రశ్నించగా, ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండు ఆవరణ పరిశుభ్రంగా ఉండేట్లు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని డి.పి.టి.ఓ మధు తెలిపారు. ఈ సందర్భంగా డిపిటిఓ మధు వెహికల్ చెకింగ్ చేశారు. వీరితోపాటు ఇంచార్జ్ డి.ఎం. నాయక్. ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎస్కే కాజా, ఎస్టిఐ.ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (Story : ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం)