Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మహిళలను దగా చేసిన జగన్‌ రెడ్డి..

మహిళలను దగా చేసిన జగన్‌ రెడ్డి..

0

మహిళలను దగా చేసిన జగన్‌ రెడ్డి..

– మహిళా సాధికారతకు పెద్ద పీట వేసిన టిడిపి

– తల్లి చేల్లిని గెంటేసిన వ్యక్తికి అక్క చెల్లి అనే అర్హత లేదు

– ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జి.వి. ఆంజనేయులు

న్యూస్ తెలుగు / వినుకొండ : మహిళలకు అనేక సంక్షేమ పధకాలు ఇస్తామని నమ్మించి జగన్‌ రెడ్డి మాట తప్పి గత ఐదేళ్ళ వైసిపి పాలనలో మహిళలను దగా చేసాడని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, సీనియర్‌ శాసన సభ్యుడు జి.వి.ఆంజనేయులు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ నాడు ఉచితంగా ఇల్లు ఇస్తామని ఓటియస్‌ పేరుతో ఒక్కో మహిళనుండి 10వేల నుండి 30వేలు వసూలు చేయడం, టిడ్కో ఇల్లు ఇవ్వకపోవడం, సెంటు పట్టా పేరుతో మహిళలను అప్పులపాలు చేసారని ఆయన ఎద్దేవ చేసారు. నాడు చంద్రబాబు పాలనలో అంగన్‌ వాడీలకు జీతాలు 6300కు పెంచారని, జగన్‌ పాలనలో జీతాలు పెంచాలని ప్రశ్నించిన అంగన్‌వాడీలపై దాడులు చేయించి అరాచాకానికి పాల్పడ్డారన్నారు. చంద్రన్నపాలనలో ‘0 ‘ వడ్డీని 5 లక్షల వరకు అమలు చేస్తే, 10 లక్షలకు పెంచుతామని హమీ ఇచ్చిన జగన్‌ రెడ్డి 3 లక్షలకు కుదించి మహిళలకు అన్యాయం చేసారన్నారు. 10bవేల కోట్లు పొదుపు సొమ్ము, 2100 కోట్లు అభయ హస్తం నిధులు దోచేసిన జగన్‌ రెడ్డి డ్వాక్రా వ్యవస్ధ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పెళ్ళి కానుక, బడికొస్తా సైకిళ్ళపంపిణి రద్దు చేయడం, తల్లి బిడ్డ ఎక్ష్‌ప్రెస్‌, ఫ్రీడర్‌ అంబులెన్స్‌లు దూరం చేయడం, గిరిజిన గర్భినీల వసతి గృహాలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. దిశ పేరుతో డ్రామా తప్ప ఆడబిడ్డలకు జగన్‌ పాలనలో రక్షణ లేదని, వైసిపి పాలనలో 30,196 మంది మహిళలు, చిన్నారులు మిస్‌ అవ్వడం దుర్మార్గాం అన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్‌ రెడ్డి రాష్ట్రంలోని మహిళలని అక్క చెల్లి అనే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. టిడిపి ఆవిర్భావం నుండి రాష్ట్రంలో మహిళ సాదికారతకు పెద్దపీట వేస్తూ వచ్చిందని, ఆస్తిలో సమానా హక్కు, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, మహిళల పేరుపై ఇళ్ళపట్టాలు, ఇంటినిర్మాణం వంటి ఎన్నో పధకాలు టిడిపి తీసుకొచ్చిందన్నారు. మహిళా సంక్షేమానికి 2025-26 బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానకి 4332 కోట్లు కేటాయించి ఆదుకుందన్నారు. వైసిపి ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన డ్వాక్రా సంఘాలకు కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తుందని,’ 0 ‘వడ్డీ రుణాల పరిమితిని 5 లక్షలకు పెంచిదన్నారు. యస్‌.సి, యస్‌.టి మహిళల జీవనోపాది మెరుగుకు 50 వేల నుండి 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనుందని, వడ్డీరాయితీ రుణాలను త్వరలో 10 లక్షలకు పెంచనుందని, అంగన్‌వాడీలు, ఆషావర్కర్లు ఎన్నాళ్లకుగానో ఎదురు చూస్తున్న గ్రాడ్యూటి చెల్లింపుకు శ్రీకారం చుట్టి మహిళలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేసారు. (Story : మహిళలను దగా చేసిన జగన్‌ రెడ్డి..) 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version