ఆటో కార్మికుల కోసం ఆటోవాలా యాప్ ప్రారంభం
జిల్లాలో ఆటో డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఏఐటీయూసీ అండ
యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు
న్యూస్ తెలుగు /చింతూరు : నిత్యం రోడ్ మీద ప్రయాణించే ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ట్రాపిక్ ఆర్టీఓ వారి తో సమస్య వచ్చిన డ్రైవర్ తన మొబైల్ లో ఆటో వాలా యాప్ కు వెళ్లి ప్రెస్ చేస్తే వెంటనే ఏఐటీయూసీ, ఆటో యూనియన్ అండగా ఉంటారని తాటిపాక మధు అన్నారు.మంగళవారం ఉదయం స్థానిక అంబల్లా సూర్యారావు భవన్ లో ఆటో యూనియన్ సమావేశము యూనియన్ అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య ఆధితిగా పాల్గొన్న మధు ఆటో యాప్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఆటో అండ్ మోటార్ కార్మికులకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈ నెలలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో అమలచేయాలని కోరారు జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలి వాహన మిత్ర 15 వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జి ఆర్ ఎస్ 124( e) నోటిఫికేషన్ 8 94 నోటిఫికేషన్ డ్రైవర్లకు ఉపాధి లేకుండా చేసే 2023 నూతన మోటారు యాక్ట్ చట్టం 106(1)(2) ను రద్దు చేయాలని టాటా మ్యాజిక్ వ్యానులు కార్లు జీపులపై భారీగా పెంచిన రోడ్ టాక్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గ్రీన్ టాక్స్ లేబర్ టాక్స్ టోల్గేట్ ఫీజులను 30 శాతానికి తగ్గించి డ్రైవర్ల పిల్లలకు విద్యా కానుక వెంటనే ఇవ్వాలి. ఆటో డ్రైవర్స్ అండ్ మోటార్ కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని డిమాండ్ చేశారు.(Story : ఆటో కార్మికుల కోసం ఆటోవాలా యాప్ ప్రారంభం )