Home వార్తలు నటిగా అన్ని రకాల పాత్రలు చెయ్యాలని ఉంది

నటిగా అన్ని రకాల పాత్రలు చెయ్యాలని ఉంది

0

నటిగా అన్ని రకాల పాత్రలు చెయ్యాలని ఉంది

అక్షర నున్న సుజన !!!

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా:  తెలుగమ్మాయి అక్షర నున్న సుజన నటన పట్ల ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటగా కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివడవురా’ సినిమాతో పెళ్లి కూతురు పాత్రలో నటించింది. ఆ తరువాత రామ్ రెడ్ మూవీలో ఇంస్పెట్టర్ సంపత్ కుమార్తె రోలో లో మెప్పించింది, ఈ మూవీ తరువాత అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప సినిమాలో హీరో వదిన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పుష్ప పార్ట్ 2 లో కూడా అక్షర పాత్ర కొనసాగుతుంది. రవితేజ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తోన్న రావణాసుర ఒక విభిన్న రోల్ లో నటిస్తోంది.
టాలెంటెడ్ ఉంటే తెలుగు పరిశ్రమలో అవకాశాలు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయి అంటుంది అక్షర. నటనకు ప్రాధాన్యం ఉన్న మరిన్ని మంచి రోల్స్ చేయాలనేది అక్షర లక్ష్యం. తనలోని ట్యాలెంట్ చూసి ఆడిషన్స్ చేసి తనకు అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా అక్షర కృతజ్ఞతలు తెలుపుతోంది. త్వరలో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది అక్షర.
పుష్ప సినిమాలో రష్మిక మందన్న కు చెల్లెలి పాత్రలో నటించింది, అలాగే అల్లు అర్జున్ కు చిన్న వదినగా  నటించి మెప్పించింది, హీరోయిన్ రోల్స్ కాకుండా గుర్తింపు తెచ్చే రోల్స్ చేస్తూ ముందుకు వెళుతోంది అక్షర నున్న, తనకు  క్లాసికల్ డాన్సర్ గా మంచి గుర్తిపు ఉంది,    వెస్ట్రన్ డాన్స్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. రవితేజ రావణాసుర సినిమాలో జయరాం కుమార్తె పాత్రలో అలాగే , రెడ్ సినిమాలో రామ్ పోతినేని తో పాటు ఇన్స్పెక్టర్ సంపత్ రాజ్ కుమార్తెగా విభిన్నమైన రోల్ చేసింది,  వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమాలో అక్షర ఒక మంచి రోల్ చేస్తోంది, అఖండ 2 లో కూడా అక్షర ఒక మంచి రోల్ లో కనిపించబోతోంది, సాఫ్ట్ వెర్ జాబ్ చేస్తూ కూడా సినిమాల మీద ఇష్టంతో ప్యాసనేట్ గా నటిస్తూ వస్తుంది, అలాగే మరిన్ని మంచి సినిమాల్లో నటిస్తోంది అక్షర నున్న సుజన, వాటి వివరాలు త్వరలో తెలియనున్నాయి. (Story : నటిగా అన్ని రకాల పాత్రలు చెయ్యాలని ఉంది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version