గీతాంజలి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ మరియు శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, మహిళా ఉపాధ్యాయులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మహిళలు యొక్క ప్రాముఖ్యతను వారి సేవలను కొనియాడారు. సమాజంలో మహిళల యొక్క పాత్ర మహా ఉన్నతమైనదని అట్టి మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత పైన ప్రభుత్వం పైన ఉంన్నదని పేర్కొన్నారు. మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలని కోరారు. అనంతరం మహిళ ఉపాధ్యాయులను సన్మానించి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల ఉపాధ్యాయ మహిళలు మరియు వై.శేషగిరిరావు వీరి వెంట అయూబ్ ఖాన్, విశ్వనాథం, పీవీ సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు. (Story : గీతాంజలి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు )