అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు అభినందనలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు ఐక్యవేదిక సభ్యులను మాజీ ఎమ్మెల్యే జయరాములు కుటుంబం అభినందించారు. మరుగుగున పడ్డ బీసీ మాజీ ఎమ్మెల్యేలను వెలుగులోకి తెచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ జయరాములు కూతురు భరణి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా వనపర్తికి దూరంగా ఉన్న మేము కూడా పట్టించుకోని మా నాన్న పేరు గానీ, డాక్టర్ బాలకృష్ణయ్య పేరుగాని, అయ్యప్ప పేరుగాని, మిగతా ఎమ్మెల్యే పేర్లు వెలుగులోకి తేచ్చిన ఐక్యవేదిక నాయకులను మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. వనపర్తి లో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా నాన్న పేరు పెట్టడాన్ని, హాస్పిటల్ కు డాక్టర్ బాలకృష్ణయ్య పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, ప్రతిపాదించిన ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డి కి, తెలంగాణ ముఖ్యమంత్రికి, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూతుర్లు అరుణ, రోహిణి, భరణి, కుమారుడు వశిష్ట, అల్లుళ్ళు రంగస్వామి అలాగే ఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు గౌడ్, ఐక్యవేదిక సభ్యులు వెంకటేశ్వర్లు, కొత్త గోళ్ళ శంకర్,గౌని కాడి యాదయ్య, విజేత రాములు, నరసింహ, తేజ వర్ధన్ యాదవ్, దేశి తిమ్మన్న, బొడ్డుపల్లి సతీష్,శివకుమార్, బాలు, రాజేష్ యాదవ్, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు . (Story : అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు అభినందనలు)