Homeవార్తలుతెలంగాణఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించాలి

ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించాలి

ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించాలి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించి, క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి సూచించారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని నరసింగాయ్ పల్లి లో ఉన్న ఎం సి హెచ్ లో మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మన ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డయాబెటిస్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, విటమిన్ డి 3, విటమిన్ బి12, థైరాయిడ్ వంటి వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను మహిళా ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా వినియోగించుకుని తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలాన్నారు. ప్రస్తుతం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది ప్రధాన సమస్యగా మారిందని, దీన్ని ముందుగానే గుర్తించడం ద్వారానే అరికట్టడం సాధ్యమని చెప్పారు. క్యాన్సర్ మహమ్మారిని స్క్రీనింగ్ ద్వారా ముందుగానే గుర్తించినట్లయితే ప్రాణానికి ముప్పు లేకుండా కాపాడుకోవచ్చని చెప్పారు. స్క్రీనింగ్ ద్వారా ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే జీవనశైలిలో మార్పులు చేపట్టి, లేదా చికిత్స తీసుకుని ప్రాణాలను కాపాడుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

ప్రస్తుతం జిల్లాలో పిహెచ్సి ల స్థాయిలోనే మంచి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలోని ఎన్ ఆర్ సి సెంటర్ ద్వారా 400 మంది సామ్, మామ్ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచినట్లు చెప్పారు.

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకునేందుకు అంగన్వాడీ టీచర్లు, ఏపీఎంలు, సీసీలు, స్వయం సహాయక మహిళా బృందాలకు చెందిన మహిళలు తదితరులు హాజరయ్యారు. (Story : ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!