ఆలయాన్ని సందర్శించిన రావుల
న్యూస్తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయానికి విచ్చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి కి ఆలయ కమిటీ సభ్యులు సన్మానించి, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. దేవాలయ కమిటీ హాల్ ను పరిశీలించి భక్తులు ఇచ్చిన విరాళాలతో కమ్యూనిటీ హాల్ పూర్తయిందని మాజీ వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. , శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ కింది భాగాన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రాతి విగ్రహం ప్రతిష్టించబోతున్న అమ్మవారి నిర్మాణ పనులపై ఆలయ ప్రధాన కార్యదర్శి వడ్డే ఈశ్వర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి కి వివరించగా ఆలయానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వి దిలీప్ కుమార్ రెడ్డి, రాజశేఖర్, ఎద్దుల సాయినాథ్, అఖిల్ చారీ, వడ్డే రమేష్ తదితరులు పాల్గొన్నారు (Story : ఆలయాన్ని సందర్శించిన రావుల)