Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య

చత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య

0

చత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య

ప్రజా కోర్టు నిర్వహణలో 8 కుటుంబాలను గ్రామ బహిష్కారం చేసిన మావోయిస్టులు

న్యూస్ తెలుగు/ చింతూరు : చత్తీస్గడ్ రాష్ట్రంలోని బర్సుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుస్వాల్ గ్రామపంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల్లోని ఎనిమిది కుటుంబాలను గ్రామ బహిష్కారం విధించారు అన్ని తెగ దెంపులు చేసుకొని వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించారు. అలా వెళ్లకపోతే చంపేస్తామని మావోయిస్టుల బెదిరింపుతో ఆ గ్రామాల నుండి కాళీ చేసి వెళ్లిపోయారు.తుల్తులి ఎన్కౌంటర్లో 8 కుటుంబాలు ఇచ్చిన సమాచారం మేరకే ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్టులు ప్రధానంగా విశ్వసించారు. ఎన్కౌంటర్లో చాలామంది మావోయిస్టులు హతమయ్యారని మావోయిస్టుల ఆరోపించారు. మూడు రోజుల క్రితం గ్రామంలో ప్రజా కోర్ట్ నిర్వహించారు. తూర్పు భస్తర్ డివిజన్ కమిటీ ఆదేశాల మేరకు మావోయిస్టులు ప్రజా కోర్ట్ నిర్వహించారు.తుస్వాల్ గ్రామస్తులకు పోలీసులు భద్రత కల్పిస్తున్నట్లు దంతివాడ ఎస్పి గౌరవ్ రాయ్ తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాల్లో నాయకులు నిరంతరం చంపబడుతున్నారని, చాలామంది పెద్ద నాయకులు లొంగిపోయారని అన్నారు. దీనివల్ల మావోయిస్టులు నిరాశ చెంది అమాయక గ్రామస్తులను వేధిస్తున్నారన్నారు. క్రమేపీ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా, పోలీసు యంత్రాంగం గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. దీనివల్ల మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని, దీని కారణంగా 8 కుటుంబాలను గ్రామాల నుండి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారన్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందన్నారు. (Story : చత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version