దగ్ధమైన గడ్డివాములను పరిశీలించిన బి.ఆర్.ఎస్ బృందం
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 5వ వార్డ్(వస్యతాండ)నందు బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్త జరపుల.తిరుపతి నాయక్ సంబంధించిన రెండు గడ్డి వాములు మరియు కందిపొట్టు వాము అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయినాయి ఇట్టి గడ్డి వాములను బి.ఆర్.ఎస్ పార్టీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద గిరిజన రైతు అయిన తిరుపతి నాయక్ దాదాపు 80000వేల రూపాయల నష్టం జరిగిందని ఇది దురదృష్టకరం అని అన్నారు. ప్రభుత్వం విచారణ చేసి బాధితున్నీ ఆదుకోవాలని కోరారు.
తక్షణ సహాయంగా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్స్ వసంత శ్రీనివాసులు,శాంతి రమేష్ నాయక్ బాదితునికి 5000వేల రూపాయలు అందించారు. పరిశీలించిన వారిలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్,మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ప్రేమ్ నాథ్ రెడ్డి,ఎస్.టి.సెల్ వైస్ ప్రసిడెంట్ రాజు నాయక్,గోపాల్ నాయక్,పూల్య నాయక్,మన్నే నాయక్,ఖండే నాయక్,తారకమ్మ,మారగోని,శివ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. (Story : దగ్ధమైన గడ్డివాములను పరిశీలించిన బి.ఆర్.ఎస్ బృందం)