వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
న్యూస్తెలుగు/ వనపర్తి : వనపర్తి నియోజకవర్గం, పెబ్బేరు పట్టణంలో సీనియర్ పత్రిక నమస్తే తెలంగాణ విలేకరి నారా శ్రీనివాస్ కూతురు వివాహానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై వధూవరులను అక్షతలు వేసి ఆశీర్వదించారు. వారితో పాటు పెబ్బేర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రే స్వామి, రంగాపురం రాజశేఖర్, కొత్తకోట మండలం , కానాయ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ , సాయి, ఎల్లారెడ్డి, దిలీప్ రెడ్డి, సీతారా వెంకటేశ్వర్లు, డాక్టర్ బాషా, వడ్డీ రమేష్ , అఖిల్ చారి, అమర్, కొత్తకోట బాలయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. (Story : వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే)