Homeవార్తలు "సంతాన ప్రాప్తిరస్తు" టీజర్ రిలీజ్

 “సంతాన ప్రాప్తిరస్తు” టీజర్ రిలీజ్

 “సంతాన ప్రాప్తిరస్తు” టీజర్ రిలీజ్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు.

“సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీజర్ చూసి సందీప్ రెడ్డి వంగా  హిలేరియస్ గా ఎంజాయ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం సందీప్ రెడ్డిని ఎంటర్ టైన్ చేసింది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీజర్ చూసిన సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ –  టీజర్ ప్రామిసింగ్ గా ఉంది, “సంతాన ప్రాప్తిరస్తు” మంచి ఎంటర్ టైనింగ్ మూవీలా అనిపిస్తోంది. అన్ని సీన్స్ నవ్వించాయి. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

“సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసే హీరో విక్రాంత్ మీద వర్క్ ప్రెజర్ ఎక్కువే ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో యూత్ లైఫ్ కు విక్రాంత్ ఒక ఎగ్జాంపుల్ గా కనిపిస్తాడు. అందమైన అమ్మాయి కల్యాణి( చాందినీ చౌదరి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కల్యాణి తండ్రికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం ఉండదు. విక్రాంత్ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం ఈ కొత్త జంట పేరెంట్స్ కాలేకపోతారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు వైద్యుల సలహాలు, డైట్ ఫాలో అవుతూ వంద రోజుల్లో తన భార్యను ప్రెగ్నెంట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు హీరో.  ఈ ప్రయత్నంలో తను సక్సెస్ అయ్యాడా లేదా అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. ఫన్, ఎమోషన్ తో పాటు నేటితరం యూత్ ఎదుర్కొంటున్న ‘కన్సీవ్’ సమస్యను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా కన్విన్సింగ్ గా ఈ మూవీలో చూపించినట్లు టీజర్ తో తెలుస్తోంది.

నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు

టెక్నికల్ టీమ్

డైరెక్టర్ – సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ – మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే – సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
మ్యూజిక్ డైరెక్టర్ – సునీల్ కశ్యప్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
డైలాగ్స్ – కల్యాణ్ రాఘవ్
కొరియోగ్రాఫర్ – లక్ష్మణ్ కాళహస్తి
కాస్ట్యూమ్ డిజైనర్స్ – అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – శివకుమార్ మచ్చ
పబ్లిసిటీ డిజైన్ – మాయాబజార్ డిజిటల్ – హౌస్ ఫుల్ డిజిటల్
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ – విష్ణు కోమల్ల
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) (Story :  “సంతాన ప్రాప్తిరస్తు” టీజర్ రిలీజ్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!