Home వార్తలు తెలంగాణ సి.వి.రామన్ ట్యాలెంట్ స్కూల్ లో వైద్య విజ్ఞాన ప్రదర్శన

సి.వి.రామన్ ట్యాలెంట్ స్కూల్ లో వైద్య విజ్ఞాన ప్రదర్శన

0

సి.వి.రామన్ ట్యాలెంట్ స్కూల్ లో వైద్య విజ్ఞాన ప్రదర్శన

న్యూస్‌తెలుగు/ వనపర్తి : సి. విరామన్ టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్.మురళీధర్ గారి ఆధ్వర్యములో నిర్వహించిన వైద్య విజ్ఞాన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి వైద్య విజ్ఞాన ప్రదర్శన ప్రారంభించి విద్యార్థులు ప్రదర్శనలు తిలకించారు.తెలంగాణ సంస్కృతులను,వృత్తి నైపుణ్యాలను,ఆధునిక కాలంలో నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలను విద్యార్థులు కన్నులకు కట్టినట్లు రూపొందించారు.విద్యార్థుల సృజనాత్మకతను చూసి మాజీ మంత్రి మురిసిపోయారు.శ్రద్ధగా ప్రదర్శన చూసి వివిధ విభాగాలలో విద్యార్థులు రూపొందించిన అంశాలును చూసి వారిని అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు అని కొనియాడారు. ఇంత గొప్పగా వైద్య విజ్ఞాన ప్రదర్శన నిర్వహించిన స్కూల్ యాజమాన్యాన్ని,అధ్యాపక బృందాన్ని అభినందించారు. నిరంజన్ రెడ్డి వెంట వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్,ప్రేమ్ నాథ్ రెడ్డి,కంచ.రవి,శివ లక్ష్మణ్ మరియు స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ మురళీధర్,డాక్టర్ శారద,డాక్టర్.హరికృష్ణ,డాక్టర్ ప్రత్యూష, డాక్టర్.సిద్ధార్థ, డాక్టర్.మౌనిక,సత్తార్ సార్,నవీన్ కుమార్,షబానా మేడం, నజ్వాల.రాధాకృష్ణ,గంధం.నాగరాజుతదితరులు పాల్గొన్నారు. (Story : సి.వి.రామన్ ట్యాలెంట్ స్కూల్ లో వైద్య విజ్ఞాన ప్రదర్శన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version