రాష్ట్ర విధ్వంసం, దోపిడీ పునాదులపై లక్షల కోట్లకు జగన్
అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు /వినుకొండ : అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేసిన సంపదతో జగన్ లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారమే 2004లో కేవలం రూ.2 కోట్ల ఆస్తులున్న వ్యక్తి ఇప్పుడు 50 కంపెనీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా అధిపతి అయ్యారని, ఇంత సంపద ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరో ధ్యాస లేకుండా సంపద సృష్టి ఊసు లేకుండా రాష్ట్రాన్ని దివాళా తీయించిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారాయన. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంగళవారం తన ప్రసంగంలో ఈ మేరకు జగన్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని, కాంట్రాక్టర్లకు రూ. లక్షా 40వేల కోట్లు పెం డింగ్ పెట్టారని ఆ డబ్బంతా ఏం చేశారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల మొదలు కోడిగుడ్లు, చిక్కీల వరకు వేలు, వందల కోట్లు పెండింగ్ పెట్టారని వాపోయారు. సంక్షేమానికి 2.7 లక్షల కోర్చు పెట్టామన్నారు సరే… తెచ్చిన అప్పుల్లో మిగిలిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. జగన్ చేసిన అప్పుల ఫలితంగా అసలు వడ్డీకి కలిపి ఏడాదికి రూ. 60 వేల కోట్లు కట్టాల్సి వస్తోందని, ఎక్కడ రాష్ట్రానికి అప్పులు పుట్టని పరిస్థితులు తెచ్చారన్నారు. అలాంటి విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేసేలా బడ్జెట్ పెట్డడం అభినందనీయం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేయూతనిచ్చేలా, రైతేరాజు అన్న మాటను నిజం చేసేలా కేటాయింపులు చేశారన్నారు. 5ఏళ్ల వైకాపా పాలనలో ప్రాజెక్టులన్నీ అటకెక్కాయని, కూటమి వచ్చాకే మళ్లీ అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నామన్నారు. అయిదేళ్లు అమరావతిలో తట్ట మట్టి వేయని జగన్ పోలవరాన్ని కూడా అలానే బలిపెట్టాలని చూశారన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు చొరవతో మళ్లీ కేంద్రం నుంచి అమరావతి, పోలవరానికి నిధులు తీసుకు వచ్చి పనులు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. రహదారులపై గుంతలు పూడ్చడం 80% పూర్తయిందన్న జీవీ అవే పనులు వైకాపా హయాంలో ఎందుకుచేయలేదో చెప్పాలన్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన లక్షా 14వేల కోట్లు పక్కదారి పట్టించడం దుర్మార్గమన్నారు. మూలధన వ్యయం మాట పట్టక అప్పులు పెంచి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. చివరకు ఆస్తులు తాకట్టు పెట్టారను గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో కూటమి వచ్చాక తిరిగి మూలధన వ్యయం పెచారని, విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం శుభపరిణామంగా పేర్కొన్నారు. 5ఏళ్ల వైకాపా పాలనలో పిల్లలు చదువుకోవడానికి కనీస వసతుల్లేకుండా చేశారని, బీసీ, ఎస్సీ హాస్టళ్ల ను గాలికి వదిలేశారన్న జీవీ జగన్ జల్సాలకు మాత్రం వందల వేల కోట్లు దుబారా చేశారని ఆవే దన వ్యక్తం చేశారుపెన్ను, పేపర్లకు రూ.9.74కోట్లు తగలేశారని, ప్యాలెస్‌కు ఇనుప ఫెన్సింగ్ కోసం 12.5 కోట్లు ఖర్చు చేశారన్నారు. సర్వేరాళ్ల మీద ఫోటోలు వేసినందుకు 700కోట్లు పెట్టా రని ఆలానే ఫోటోల పిచ్చికి వేల కోట్లు ఖర్చు చేశారు గానీ విద్యార్థుల చదువుల పట్టించుకోలేద న్నారు. నాసిరకం మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవడం పట్టించుకోలేదన్నారు. ఇంకా సిగ్గు లేకుండా 30ఏళ్లు ఉంటామంటున్నారని. 151 నుంచి 11కి పడేసిన బుద్ధి మారలేదన్నారు. ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు? దోచుకోవడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేద్దాం, రైతులకు నీళ్లు ఇద్దామని ఏరోజైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం. నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని వడివడిగా అడుగులు వేస్తున్నామన్నారు. తిరిగి దేశంలోనే వ్యవసాయాన్ని నంబర్-1 చేయాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో శాంతిభద్రతలు తిరిగి అదుపులోకి వచ్చాయని, ప్రజల ధనమానప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు. లోకేష్ విద్యామంత్రి అయ్యాక మళ్లీ నాణ్యమైన విద్యకు ప్రభుత్వ బడులను కేరాఫ్‌గా మార్చాలని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జీవో 117 రద్దు చేసి ప్రభుత్వ బడులకు తిరిగి ప్రాణం ఇచ్చారన్నారు. టాప్-100 విశ్వవిద్యాలయాల్లో ఏపీ నుంచి కూడా ఉండాలని మంత్రి లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని జీవీ ఆంజనేయులు తెలిపారు. (Story : రాష్ట్ర విధ్వంసం, దోపిడీ పునాదులపై లక్షల కోట్లకు జగన్)