Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మ‌ర్చిపోయారా..?

రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మ‌ర్చిపోయారా..?

0

రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మ‌ర్చిపోయారా..?

పిడిక రాజన్న దొర

న్యూస్ తెలుగు/ సాలూరు : రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రమాణాన్నే మర్చిపోయి మీటింగులలో వైయస్సార్ పార్టీ వారికి ఏ పని చేయకూడదు అనడం ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర అన్నారు. పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయ కళావతి అన్నారు సోమవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ప్రధానమంత్రి అయిన ముఖ్యమంత్రి అయిన మంత్రి అయిన పక్షపాతం గాని బంధు ప్రీతి గాని లేకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారని అన్నారు. . ఇవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మర్చిపోయి సమావేశాల్లో వైయస్సార్ పార్టీ వారికి పనులు చేయకూడదనడం అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయన మర్చిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ముఖ్యమంత్రిగా అనర్హుడుగా ప్రకటించాలని అన్నారు.దీనిపై మేధావులు రాజనీతిజ్ఞులు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించాలని అన్నారు.గత ఐదు సంవత్సరాలుగా వైయస్సార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు కులం గాని, మతం గాని, రాజకీయంగాని చూడకుండా అన్ని వర్గాల వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అప్పుటి ప్రభుత్వంలో వైయస్సార్ పార్టీ కార్యకర్తలు కన్నా అన్ని పార్టీ కార్యకర్తలకి ఎక్కువగా సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. వాలంటరీలు గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది అని అన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు సిఫార్సులు ఇచ్చిన వారికే పథకాలు అందుతున్నాయని అన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పేరుతో రాష్ట్రంలో ఎలా దోపిడీ జరిగిందో ప్రజలందరికీ తెలుసని ఇప్పుడు కూడా అదే ధోరణి ఈ ప్రభుత్వం అవలంబిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో సొమ్ము కడుతున్నారని ఒక తెలుగుదేశం పార్టీ వారే కె ఈ పథకాలు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ముఖ్యమంత్రిని నిలదీశారు. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని హామీ ఇచ్చిన కుటమీ ప్రభుత్వం గత బడ్జెట్లో అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పినప్పటికీ ఇవ్వలేదు అని అన్నారు. ఈ పథకాలు ఇవ్వకుండా ప్రజలకు నమ్మకద్రోహం చేశారని అన్నారు. నిరుద్యోగ భృతి ఎస్సీ ఎస్టీ బీసీ లకు 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తామని చెప్పి వారికి ఇవ్వకపోగా కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వకపోగా ఉన్ని పెన్షన్లు వేరే కారణాలను తగ్గిస్తారని అంటున్నారని అన్నారు. మహిళకు ఫ్రీ బస్సు తుస్ ప్రతి మహిళా ఎకౌంట్లల లో 1500 ఇస్తామని చెప్పి అది కూడా ఎగ్గొట్టారని అన్నారు.చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడమే గాని అవి నెరవేర్చిన ఘనత ఆయనకు లేదని అన్నారు. గతంలో డ్వాక్రా మహిళలకు రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఒక రూపాయి కూడా మాఫీ చేయలేదని అన్నారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారని అన్నారు. కనీసం ఈ సంవత్సరం ఇస్తున్న పథకాలైన అర్హులైన పేద వారందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. (Story : రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మ‌ర్చిపోయారా..?)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version