జనం బిచ్చగాళ్లలా మారిపోయారు!
కేంద్ర మాజీ మంత్రి, బిజేపీ నేత నోటిదూల
రాయ్‌గఢ్: ఉచితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి నోటిదురుసుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచితంగా తాయిలాలు ఎరచూపడంపై ఇప్పటికే దేశంలో చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ప్రజలను బెగ్గర్లుగా కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అభివర్ణించారు. ప్రజల్లో అడుక్కునే అలవాటు పెరుగుతోందని ప్రహ్లాద్ సింగ్ పటేల్ (Prahlad Singh Patel) సంచలన వ్యాఖ్యలు చేసి, కలకలం రేపారు. మధ్యప్రదేశ్ పంచాయతీ, గ్రామాణభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ సింగ్ ఆదివారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి ప్రతీదీ అడుక్కోవడానికి ప్రజలు అలవాటుపడుతున్నారని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధునుల నుంచి వీరు పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. రత్నగిరి జిల్లా సుథలియా టౌన్‌లో రాణి అవంతి బాయ్ లోథి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. రామ్‌గఢ్ (ప్రస్తుంతం దిండోరి) క్వీన్‌గా ఉన్న అవంతీ బాయ్ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులపై పోరాడి 1958 మార్చి 20న తన ప్రాణాలను కోల్పోయారు. దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలను అర్థం చేసుకుని, వారు చూపించిన విలువలను పాటించనప్పుడే ప్రతి ఒక్కరూ విజయాలు సాధిస్తారని అన్నారు. అప్పుడే సమాజానికి మనం తిరిగి ఏదైనా ఇవ్వగలుగుతామని చెప్పారు. అయితే ప్రజలు సమాజం నుంచి తీసుకోవడమే అలవాటు చేసుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి బెగ్గింగ్ చేయడానికి అలవాటు పడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఉచితాలు పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలు తమ డిమాండ్లను ఏకరవుపెడుతూ లేఖలు ఇస్తున్నారని ఆరోపించారు. రాజకీయనేతలను దండలు వేసి, డిమాండ్ లెటర్లు ఇచ్చే పద్ధతి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బెగ్గర్ల ఆర్మీ వల్ల సమాజానికి ఒరిగేదేమీ ఉండదని, పైగా సమాజం బలహీనపడుతుందని అన్నారు. ఉచితాలు తీసుకోవడానికి అలవాటు పడటం సరికాదన్నారు. కాగా, ప్రజలను బిచ్చగాళ్లంటూ మంత్రి ప్రహ్లాద్ సింగ్ మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. బీజేపీకి ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలు దేవుళ్లుగా, ఓట్లు వేయించుకున్న తరువాత బికారుల్లా కనిపిస్తారని దుయ్యబట్టింది. ప్రహ్లాద్‌సింగ్ వ్యాఖ్యల పట్ల ఇండియా కూటమిలోని ఇతర పార్టీలూ తీవ్రంగా ధ్వజమెత్తాయి. ప్రజలను బిచ్చగాళ్లగా చూడటం బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తున్నదని సీపీఐ, సీపీఐ(ఎం)లు వ్యాఖ్యానించాయి. (Story: జనం బిచ్చగాళ్లలా మారిపోయారు!)
Follow the Stories:
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!