బడ్జెట్ అంతా మాయాజాలం
స్త్రీలకు బస్సులో ఉచిత ప్రయాణం ఊసే లేదు
నిరుద్యోగ భృతి లేదు
రైతు భరోసా కు అరకొర నిధులు
సూపర్ సిక్స్ లేదు
బాబు షూరిటీ బాండ్లు లేవు
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
న్యూస్ తెలుగు / వినుకొండ : కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. ఒక రంగానికి 11 వేల కోట్లు కేటాయించవలసి ఉండగా కేవలం 6, 000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారని విమర్శించారు. రైతు భరోసా రైతుని నట్టేట ముంచారన్నారు. స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదన్నారు. ఆనాడు ఓట్ల కోసమే చంద్రబాబు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్, బాబు షూరిటీ బాండ్ లంటూ ఓటర్లను మభ్య పెట్టారన్నారు. అలాగే పేదల గృహాల ఊసే లేదని బ్రహ్మనాయుడు ఆగ్రహించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ నిధులు కేటాయించలేదన్నారు. ఎన్నికల సమయంలో నారా లోకేష్ వినుకొండ సమీపంలో ఓ గ్రామంలో వరికపూడి సెల ప్రాజెక్టు మంటూ తాత్కాలిక శంకుస్థాపన చేశారు. అయితే బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. అంతా అబద్ధపు బడ్జెట్ అని అన్నారు. ఆనాడు వర్రికపూడి సెలకు జగన్ మోహన్ రెడ్డి టైగర్ ఫారెస్ట్ కు క్లియరెన్స్ ఇప్పించి శంకుస్థాపన చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆనాడు ఎన్నికల సమయంలో వరికపూడిసెల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించి ప్రాజెక్టు పూర్తి అనంతరం సాగు, త్రాగునీరు గలగల పారిస్తామని ఓటర్లను మభ్యపెట్టి నేడు ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసం చేయటమేనన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో రౌడీ షీటర్లే రాజ్యమేలారని ఆయన దుయ్యబట్టారు. ఇక వైసిపి నేతలపై, కార్యకర్తలపై కేసులు పెట్టించి, పోలీసులచే కొట్టించడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా కూటమి ప్రభుత్వానికి సలాం చేస్తున్నారని.. ఇక పోలీస్ స్టేషన్ లకు టిడిపి కార్యాలయం అని బోర్డు పెట్టుకోవచ్చు కదా అని బొల్లా ఎద్దేవా చేశారు. ఇక పది మాసాలుగా వినుకొండలో ఒక్క అభివృద్ధి పని ప్రారంభించలేదని, సత్వరం వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ప్రజల మన్నన పొందాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా. చీప్ విప్,ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కు సూచించారు. ఈ సమావేశంలో వైసిపి లీగల్ సెల్ న్యాయవాది ఎం.ఎన్.ప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్లు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, గంధం బాలిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బేతం గాబ్రియేలు, నాయకులు పగడాల వెంకటరామిరెడ్డి, టి.కొండల రెడ్డి, రాజా, తదితరులు పాల్గొన్నారు. (Story : బడ్జెట్ అంతా మాయాజాలం)