నారాయణ స్కూల్ లో సైన్స్ డే వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నారాయణ స్కూల్ నందు ఘనంగా సైన్స్ డే వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా డాక్టర్ గోగినేని పద్మజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ పద్మజ, ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ. పిల్లల వయసు నుంచి వారిలో నైపుణ్యత ప్రదర్శించే దానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలని అన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థు లు తయారుచేసిన పలు రకాల సైన్స్ ప్రాజెక్ట్లను ఆసక్తిగా పరిశీలించి ఉత్తమమైన వాటికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి , కోఆర్డినేటర్స్ భద్రారెడ్డి మరియు గౌస్య , ఇన్చార్జిలు యమునా మరియు మాధవి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : నారాయణ స్కూల్ లో సైన్స్ డే వేడుకలు)