జయరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి లో చదువుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి స్వాగతం సుస్వాగతం అని నాలుగు సంవత్సరాలుగా పోరాటాన్ని స్వాగతించి, ప్రారంభం చేస్తున్న నూతన భవనాలకు బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టడం స్వాగతిస్తున్నాం. జయరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా డిమాండ్ చేశారు.
గత నాలుగు సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక బీసీ ఎమ్మెల్యేల విగ్రహాల గురించి, వారి చేసిన సేవల గురించి పోరాటం చేస్తే, ఫలితంగా రేపు వనపర్తికి రాబోతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేస్తున్న సమీకృత రెసిడెన్షియల్ భవనాలకు జయ రాములు గారి పేరు, 500 పడకల ఆసుపత్రికి డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టడం స్వాగతిస్తున్నాముఅని , ఎమ్మెల్యే మెగా రెడ్డికి , సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కేంద్రమంత్రి జయపాల్ రెడ్డి గారు జయరాములు గారి పేరు మీద పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ ను ఓపెన్ చేశారు. ఇప్పుడు వారి పేరు తూడ్చి వేశారు. దాన్ని కూడా పుణరుద్దరించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, సీనియర్ నాయకులు పుట్టపాక బాలు, బీసీ నాయకులు గౌని గాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శ్రీనివాసులు, పాషా తదితరులు పాల్గొన్నారు. (Story : జయరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి)