స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు బలమైన పునాదిగా రాష్ట్ర బడ్జెట్
న్యూస్ తెలుగు /వినుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు బలమైన పునాదిగా రాష్ట్ర బడ్జెట్ నిలిచిందని ప్రభుత్వ ఛీప్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం… దానికి పరిష్కారాలు చూపగల ముఖ్యమంత్రి చంద్ర బాబు సామర్థ్యాలకు ఇది నిదర్శనంగా నిలిచిందన్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూ. 3,22, 359కోట్లతో రూపొందించిన బడ్జెట్‌లో అన్నిరంగాలు, అన్నివర్గాల వారికి అండగా నిలిచే ప్రయత్నం చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఒకవైపు అప్పులు, వడ్డీలకే రూ. 60వేలకోట్లు కట్టాల్సి వస్తున్న తరుణంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం రూ.75వేల కోట్ల వరకు కేటాయి ంపులు చేయడం ఆయావర్గాల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఉదాహరణగా పేర్కొ న్నారాయన. అన్నమాట ప్రకారం తల్లికి వందనం అమలుకు రూ. 9వేల 407 కోట్లు, అన్నదాత సుఖీ భవకు రూ. 6వేల 30కోట్లు ఇవ్వడాన్ని సూపర్‌సిక్స్ పథకాల అమల్లో తిరుగులేని ముంద డుగుగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ పెన్షన్లకు రూ. 27వేల 518కోట్లు కేటాయించడ ద్వారా వృద్ధులు, దివ్యాంగులు సహా లబ్దిదారులందరికీ భరోగా నిలిచారన్నారు. పోలవరానికి రూ. 6వేల 705కోట్లు, అమరావతికి రూ.6వేల కోట్లు కేటాయించడం ద్వారా వాటి పూర్తిపై విశ్వాసం కలిగించారన్నారు. విద్యారంగానికి దాదాపు రూ.40వేల కోట్ల కేటాయింపులతో రాష్ట్ర భవితకు పెద్దపీట వేయడం ఎంతో సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు. వీటన్నింటి ద్వారా బ్రాండ్ ఏపీపై తిరిగి నమ్మకం కలిగించడం, పెట్టుబడులు, పరిశ్రమలను ఆహ్వానించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 73 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలను తిరిగి ఉపయోగించుకోవాలని నిర్ణయించడం మంచి పరిణామం. తద్వారా కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయం నుంచి ప్రజల వైద్యారోగ్యం వరకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందన్నారు. (Story : స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు బలమైన పునాదిగా రాష్ట్ర బడ్జెట్)