గ్రామగ్రామానికీ వైసీపీని తీసుకువెళ్దాం
న్యూస్ తెలుగు/సాలూరు : జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు సమన్వయంతో వైయస్సార్ పార్టీని గ్రామ గ్రామానికి అనుబంధ విభాగాల సభ్యులందరూ పార్టీని తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర అన్నారు. శుక్రవారం ఆయన స్వగృహంలో అనుబంధ విభాగాల కు ఎంపికైన సభ్యులందరూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ రాజన్న దొరను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటివలే వైసీపీ అధిష్టానం రాష్ట్రంలో వివిధ అనుబంధ విభాగాల పదవులను,జిల్లాల వారీగా,నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా వివిధ వివిధ హోదాల్లో నియమించిందని అన్నారు ప్రతి ఒక సభ్యులు పార్టీ కార్యకర్తలు వైయస్సార్ పార్టీని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేవరకు అందరం కలిసికట్టుగా పనిచేయని అన్నారు.మా మీద నమ్మకం ఉంచి మాకు ఈ పదవులు ఇచ్చినందుకు అధిష్టానంనకు మీకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామని సభ్యులు తెలిపారు,వైసీపీ పార్టీ పటిష్టతకు మా వంతు కృషి చేస్తామని రాజన్నదొర కి వీరందరూ హామీ ఇచ్చారు. సమణ్వయంతో మనమంతా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసి జగనన్నని సీఎం చేసుకోవాలని వారు రాజన్నతో అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి సాలూరు పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు పిరిడి రామకృష్ణ మాదిరెడ్డి మధుసూదన్ రావు కొల్లి వెంకటరమణ మద్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు. (Story : గ్రామగ్రామానికీ వైసీపీని తీసుకువెళ్దాం)