ప్రభుత్వ నిర్లక్ష్యం,సమన్వయ లోపంతో ప్రమాదంలో కార్మికుల ప్రాణాలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాద స్థలిని పరిశీలించడానికి వెళ్లిన బిఆర్ఎస్ బృందాన్ని అడ్డుకోవడంతో హరీష్ రావు,నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,డాక్టర్. లక్ష్మారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం,సమన్వయ లోపంతో అమాయకులైన 8మంది కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని వారి పట్ల కుటుంబ సభ్యులు,ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం మాత్రం మీన మేషాలు లెక్కిస్తూ నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు టన్నెల్ లో చిక్కుకొని 6రోజులు గడుస్తున్న సహాయక చర్యలు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడాని నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సహాయక చర్యల కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్,రైల్వే,సింగరేణి,నేవి బృందాలు అక్కడికి చేరుకున్న వాటిని సమన్వయం చేసే తెలివి తేటలు,సామర్థ్యం ప్రభుత్వంతో లేకపోవడంతో ఆ బృందాలు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాయని అన్నారు.ఉత్తమ కుమార్ మాటలు సిగ్గుచేటు. తమ నిస్సహాయతను బి.ఆర్.ఎస్ పార్టీపై ఉత్తమ్ తెలపడాని నిరంజన్ రెడ్డి ఖండించారు. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనులు బి.ఆర్.ఎస్ చేపట్టలేదని మంత్రి వ్యాఖ్యనిచడాని నిరంజన్ రెడ్డి ఖండిస్తూ కాంగ్రెస్ పాలనలో 3300మీటర్లు తవ్వితే మా హయాములో కరోన వచ్చిన 3600మీటర్ల టన్నెల్ సమర్థవంతంగా కేసీఆర్ త్రవించారని అన్నారు. మంత్రులు రోజు ఉదయం,సాయంత్రం అక్కడికి వచ్చి కేవలం ప్రెస్ మీట్లకు హాజరై ఒక పర్యాటక కేంద్రానికి వచ్చినట్లు రావడాని నిరంజన్ రెడ్డి ఖండించారు. సహాయక బృందాలను అభినందించిన నిరంజన్ రెడ్డి. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న ఎన్.డి.ఆర్.ఎఫ్,రైల్వే,నేవి,సింగరేణి బృందాలను వారు చేపడుతున్న చర్యలనునిరంజన్ రెడ్డి గారు అభినందించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసి ప్రాణాలు కాపాడాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. (Story : ప్రభుత్వ నిర్లక్ష్యం,సమన్వయ లోపంతో ప్రమాదంలో కార్మికుల ప్రాణాలు)