ఒకే రోజు వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తికి వస్తున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల ఏర్పాట్లను గురువారం ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేఘారెడ్డి లు పరిశీలించారు. మొదటగా హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించిన వారు అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభాస్థలి, జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటుచేసే శంకుస్థాపనల ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ సీఎం గా పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తాను చదువుకున్న ఊరికి తొలిసారి రానున్నారని తెలిపారు. 14 నెలల కాలంలో వనపర్తిలో రూ.397 కోట్లతో అభివృధ్ది కార్యక్రమాలకు సహకారం అందించారన్నారు. మార్చి 2 తేదీ నాడు రూ.721 కోట్లకు సంబంధించి శంకుస్థాపనలు చేయబోతున్నారని చెప్పారు.వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివ్రుద్ధికి రూ.1 కోటితో, శంకుస్థాపన చేయనున్నారన్నారు. రూ.257 కోట్లతో హాస్పిటల్ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. రూ.60 కోట్లతో తాను చదువుకున్న జడ్పీ స్కూల్, జూనియర్ కళశాల అభివృద్ధి కి శంకుస్థాపన చేయనున్నారన్నారు. రూ.22 కోట్లతో ఐటీ టవర్ కు, రూ. 81 కోట్లతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి, రాజనగరం నుంచి పెద్దమందడి రోడ్డుకు రూ.40 కోట్లతో శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ సీఎం వనపర్తిలో చదువుకున్న నేపథ్యంలో, ఆయనకు ఇక్కడి ప్రాంతంలో మంచి అనుబంధం ఉన్న కారణంగా వనపర్తి అసెంబ్లీ అభివృద్ధి కోసం రూ.721 కోట్లతో శంకుస్థాపనలు చేయబోతున్నారన్నారు. సీఎం రేవంత్ ఆయనతో చదువుకున్న వారందరితో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొననున్నారన్నారు.
ఆయన ఇక్కడ ఉన్నప్పుడు పార్వతమ్మ అనే వారి ఇంట్లో ఉండి చదవుకున్నారని, వారి ఇంటికి కూడా సీఎం రాబోతున్నారన్నారు.
ఎస్ఎల్బీసీ పై మాట్లాడే నైతిక హక్కు బిఆర్ ఎస్ పార్టీకి లేదని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు..గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు తూడి మెగారెడ్డి నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి లతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడారు
మార్చ్ 2వ తేదీన వనపర్తి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని సుమారు రూ 721 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. సీఎం పర్యటనను కార్యకర్తలు,నాయకులు సమిష్టిగా పనిచేసే విజయవంతం చేయాలని కోరారు.ఎస్ఎల్బీసీ స్వరంగంలో జరిగిన దుర్ఘటన దురదృష్టకరం అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిరంతరం సాగునీటి ప్రాజెక్టు అధికారులతో విపత్తు నివారణ సంస్థల సమన్వయంతో ప్రమాదంలో చిక్కుకపోయినా కూలీలను వెలికి తీసే ప్రయత్నాలుకొనసాగుతున్నాయన్నారు. రెస్యు ఆపరేషన్ చేసే క్రమంలో పరిస్థితులు అనుకూలించటం లేదని ఇబ్బందికరమైన పరిస్థితుల ఎదురవడంతో సహాయక చర్యలు చేపట్టెందుకు విపత్తు బృందం వెళ్లలేని పరిస్థితిలో లేదన్నారు.అందుకు నీటిని, బురదను బయటకు తరలించే ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేసి ఆపరేషన్ పూర్తి చేస్తామని చేస్తామని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కేటీఆర్,ఎస్ఎల్బీసీ పై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో సుమారు అరవై లక్షల కోట్లు ప్రజల పై అప్పు మోపి ఎస్ఎల్ బిసి ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేని మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయడం ద్వారా వెనుకబడిన ప్రాంతమైన నల్గొండ ప్రజలకు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు త్రాగునీరు అందించే ప్రయత్నం మొదలుపెడితే కాంగ్రెస్ ఎక్కడ పేరు వస్తుందన్న అక్కస్సుతో కాంగ్రెస్ పార్టీపై టిఆర్ఎస్ నాయకులు బట్ట కాల్చి మీదవేసేధోరణినిప్రదర్శిస్తున్నారన్నారు. కొండగట్టు ప్రాజెక్టు పాలమూరు కొండగట్టు ప్రాజెక్ట్ రంగారెడ్డి ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులలోని దుర్ఘటనలు జరిగినప్పుడు మాజీ సీఎం సీఎం కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ప్రాజెక్టులు తట్టు కూడా చూడలేదని కానీ సీఎం రేవంత్ రెడ్డి దుర్ఘటన జరిగిన వెంటనే మంత్రులను పురమాయించి ప్రాజెక్టులకు పంపి అక్కడ స్థితిగతులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్, శ్రీనివాస్ గౌడ్, గ్రంధాలయ చైర్మన్, లంకల గోవర్ధన్, తైలం శంకర్, పట్టణ అధ్యక్షుడు, చీర్ల చందర్, మాజీ మున్సిపల్ చైర్మన్, పుట్టపాకల మహేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఒకే రోజు వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు)