ఘనంగా గణపతి పూజ పార్వతీ పరమేశ్వరుల పూజలు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ సమీపంలోని విఠంరాజు పల్లి అఖండ జ్యోతి ప్రదాత నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురువుల దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో సాయి బృందావనం చిన్న షిరిడి వద్ద హిమాలయ గురూజీ చేతుల మీదగా అంగరంగ వైభవపేతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు 12 గంటల వరకు నిర్వహించారు. గణపతి పూజ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు విశేషమైన ద్రవ్యములతో అభిషేకములు నిర్వహించారు. గణపతి హోమం, మండపారాధన హోమ, రుద్రహోమ, మృత్యుంజయ హోమం. పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణ జనసేన పార్టీ నాయకులు నిశంకర్ శ్రీనివాసరావు. పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండోప తండాలుగా పాల్గొన్న భక్తులను ఉద్దేశించి గురూజీ మాట్లాడుతూ మాట్లాడుతూ. ఈ మహత్తరమైన మహోత్సవం సర్వలోక కళ్యాణార్థమై రైతులు, వ్యాపారులు, కార్మికులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భూగర్భ జలాలు పెరిగి ప్రకృతి పచ్చదనంతో పులకించాలని చేస్తున్న కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ నిర్వహకులు ఆధ్వర్యంలో వేల మందికి అన్నసంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాంతి ఆశ్రమ ట్రస్ట్ అధ్యక్షులు పెండ్యాల వెంకట మోహన్ రావు, కనిగండ్ల. అనంత కోటేశ్వరరావు, పెండ్యాల. కాశి, కొప్పురావూరి. సుధాకర్, పెండ్యాల .పుల్లారావు, మునిరెడ్డి. తదితరులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.(Story : ఘనంగా గణపతి పూజ పార్వతీ పరమేశ్వరుల పూజలు)