త్రికోటేశ్వరుని దర్శించుకున్న జివి దంపతులు
న్యూస్ తెలుగు/ వినుకొండ : నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ, ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రికోటేశ్వరుని స్వామి వారిని ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు , లీలావతి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, బిజెపి పట్టణ ఇన్ చార్జ్ యార్లగడ్డ లెలిన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. ఆదేవదేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. (Story : త్రికోటేశ్వరుని దర్శించుకున్న జివి దంపతులు)