మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవ ఆధ్వర్యంలో వివిధ పుణ్యక్షేత్రాలు అయిన శ్రీశైలం, కోటప్పకొండ, మానేపల్లి ఏపీఎస్ఆర్టీసీ డిపో డ్రైవర్స్ మరియు కార్మికులకు బుధవారం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం. కోటేశ్వర నాయక్, ఫౌండేషన్ అధ్యక్షులు గంగినేని రాఘవ, ఎస్.టి. యు నాయకులు చంద్రజిత్ యాదవ్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయాబ్ ఖాన్, బి. ఆంజనేయ రెడ్డి, ఎం.సురేష్, సోమేపల్లి శ్రీనివాసరావు, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పి.సాంబశివరావు, ఎస్. కె కాజా , జార్జి విన్సెంట్ తదితరులు పాల్గొన్నారు. (Story : మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ)