Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌హీటెక్కిన శాసన మండలి

హీటెక్కిన శాసన మండలి

హీటెక్కిన శాసన మండలి

శాసనసభ ప్రశాంతం..మండలిలో మాటల యుద్ధం
గవర్నర్‌ ప్రసంగ తీర్మానంపై వాడిగావేడిగా చర్చ
టీడీపీ, వైసీపీ పరస్పర దూషణలపర్వం
లోకేశ్‌, బొత్స ఒకరిపై ఒకరు కౌంటర్లు
రెండుసార్లు వాయిదాపడిన కౌన్సిల్‌
సూపర్‌సిక్స్‌, వీసీల రాజీనామాపై గందరగోళం

న్యూస్‌తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా సాగుతున్నప్పటికీ, శాసనమండలి మాత్రం హీటెక్కుతోంది. మండలిలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు పెద్ద సంఖ్యలో ఉండటంతో సభను అట్టుడికిస్తున్నారు. మంగళవారంనాడు ఇదే పరిస్థితి నెలకొన్నది. మండలిలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం వాడిగావేడిగా సాగింది. తూటాల్లాంటి మాటలతో పరస్పరం విరుచుకుపడ్డారు. ఉన్నట్టుండి సభలో గందరగోళం నెలకొన్నది. పరిస్థితి చేయిదాటిపోవడంతో మండలి సభాధ్యక్షులు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ జరిగింది. శాసనసభలో వైసీపీ ప్రభావం ఏమీ లేకపోయినప్పటికీ, మండలిలో మాత్రం భిన్నంగా సాగింది. తొలుత మండలి సమావేశం ప్రారంభం కాగానే సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబెడుతూ, వైసీపీ సభ్యులు తూమాటి మాధవరావు, కుంభా రవిబాబు, బొమ్మి విశ్వరాయలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దాన్ని చైర్మన్‌ మోషెన్‌రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్‌ పోడియం వద్దకు దూసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు. ఓవైపు వారు నిరసనలు తెలియజేస్తున్న సమయంలోనే టీడీపీ సభ్యులు తిరుమలనాయుడు, పి.అశోక్‌బాబు, పంచుమర్తి అనురాధ తదితరులు గవర్నరు ప్రసంగాన్ని చదువుతూ చంద్రబాబు పాలనకు ప్రతిరూపమని పొగద్తలతో ముంచెత్తారు. దీన్ని వైసీపీ సభ్యులు ఖండిస్తూ, నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చినట్లు చెప్పారని, ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అంటూ నిలదీశారు. గవర్నర్‌తో అబద్దాలు చెప్పించే దౌర్భాగ్య పరిస్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిందని విరుచుకుపడ్డారు. దీనిపై టీడీపీ సభ్యులు స్పందించి, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందంటూ కేకలు వేశారు. ఈ విధంగా వైసీపీ..టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. అదికాస్త రగడకు దారితీసింది. చాలాసేపు సభలో గందరగోళం నెలకొన్నది. గవర్నర్‌ ప్రసంగం అంశంలో తెలుగు, ఇంగ్లీష్‌లో ప్రచురణల మధ్య తేడా ఉందంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం దూషణలకు దిగడంతో పరిస్థితి మరింత దిగజారింది. సభను అందుపులోకి తెచ్చేందుకు చైర్మన్‌ మోషెన్‌రాజు మండలిని ఒకసారి వాయిదా వేయాల్సి వచ్చింది. సభ మళ్లీ మొదలైనా గందరగోళం కొనసాగింది. మండలి ఆరంభం నుంచి ముగించే వరకు గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానం అడుగడుగునా వైసీపీ, టీడీపీ పరసర్పర విమర్శలు నడిచాయి. అనంతరం శాసన మండలిని ఈనెల 28వ తేదీకి చైర్మన్‌ వాయిదా వేశారు.

తొలుత ఇంగ్లీష్‌ మీడియంపైనా రగడ జరిగింది. ఇంగ్లీష్‌ మీడియం లేకుండా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఎలా వస్తాయని వైసీపీ ఎమ్మెల్సీ మాధవ్‌ ప్రశ్నించగా..హోంమంత్రి అనిత కౌంటర్‌ ఇచ్చారు. వైసీపీ సభ్యులు తెలుగును అవమానిస్తున్నారని, తెలుగు మీడియంలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థానానికి వెళ్లారని, ఆ విషయం వైసీపీ ఎమ్మెల్సీలకు తెలియదా అంటూ నిలదీశారు. ఆ తర్వాత విశ్వవిద్యాలయాల ఉప కులపతుల(వీసీలు) రాజీనామాల అంశంపై మండలిలో వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. 17మంది వీసీలను రాష్ట్ర ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించిందని వైసీపీ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించగా..దానిపై మంత్రి లోకేశ్‌ లేచి..తాము బెదిరించినట్లు ఆధారాలున్నాయా?, ఈ తరహా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలన్నారు. బొత్స సత్యనారాయణ వెంటనే స్పందిస్తూ, వీసీలపై బలవంతపు రాజీనామాల ఆరోపణలపై ఒక కమిటీ వేసి విచారించాలన్నారు. మీ వద్ద ఆధారాలు ఏమైనా ఉంటే, మాకు ఇవ్వాలని, కచ్చితంగా మేము విచారిస్తామని, 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకలు అన్నింటిపైనా విచారిస్తామని మంత్రి లోకేశ్‌ తెలపడంతో మరోసారి మండలిలో వైసీపీ, టీడీపీ మధ్య మళ్లీ గొడవ చోటుచేసుకుంది. అనివార్య పరిస్థితుల్లో చైర్మన్‌ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

తిరిగి ప్రారంభమయ్యాక మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్ని వివరించారు. అయినా వైసీపీ ఎమ్మెల్యేలు దూకుడు ఆపలేదు. ఆయన ప్రసంగాన్ని ఆపుతూ వచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వలంటీర్లను మోసగించిందని, విద్యుత్‌ రేట్లు పెంచారన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై ఆధారపడి ఉందనే ఆమె చేసిన వ్యాఖ్యలతో మళ్లీ రగడ మొదలైంది. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ జోక్యం చేసుకుని..గవర్నర్‌ ప్రసంగాన్ని ఇంగ్లీషులో చదివి వినిపించారు. ఇదే సమయంలో తెలుగులో ఒక రకంగా, ఇంగ్లీషులో ఒక రకంగా గవర్నర్‌ ప్రసంగం ఉండటంతో గందరగోళానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వం.. టీడీపీ, జనసేనపై ఆధారపడి ఉందన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించగా, దానిపై రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని మండలి చైర్మన్‌ తెలిపారు. మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ..తాము ఉద్యోగవకాశాలు కల్పించామని చెప్పామేగానీ, నియమించామని చెప్పలేదని వివరణిచ్చారు. ఇంగ్లీషు మీడియం అంటూ వైసీపీ గొప్పలు చెబుతుంటుందని, అదే సమయంలో తాను ఇంగ్లీషులో చెబితే భయపడతారా? అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని, వాకౌట్‌ చేయవద్దని, అన్నింటిపైనా చర్చిద్దామని సవాల్‌ చేశారు. వలంటీర్లతో వైసీపీ వాళ్లే రాజీనామాలు చేయించారన్నారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, గతేడాది ఇదే సమయంలో వలంటీర్లను రెన్యువల్‌ చేయకుండా వైసీపీ ప్రభుత్వం మోసగించిందని మండిపడ్డారు. దీనిపై వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, తెలుగు అనువాదంలో తేడా ఉందని, తప్పుంటే మార్చుకుంటామని చెప్పాలన్నారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వంపైనే కేంద్రం ఆధారపడి ఉందని అన్నారనీ, అందులో తప్పేమిటని బొత్స ప్రశ్నించారు. లేదంటే..లేదని చెప్పాలంటూ స్పష్టంచేశారు. మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ, ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారో వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇప్పటికే ఒకరు జైలుకు వెళ్లారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బొత్స ఘాటుగా బదులిస్తూ..అలాంటి బెదిరింపులకు ఎవ్వరూ బెదరబోరని సమాధానమిచ్చారు. ఇలాంటి చాలా చూశామని, ఇవేవీ మాకు కొత్తకావని అన్నారు. (Story: హీటెక్కిన శాసన మండలి)

Follow the Stories:

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

జ‌గ‌న్‌..జ‌స్ట్ ఫైవ్ మినిట్స్‌! అలా వచ్చి..ఇలా వెళ్లి..!

జగన్‌ టీమ్‌కు అనర్హత భయం!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!