కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా తయారయింది
జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : ఈ కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా తయారయిందని జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు సోమవారం తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా తయారయిందని, ప్రతి ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరణ చేసే విధంగా అడుగులు వేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మన జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులు అందరూ కలిసి ఎంతవరకు లబ్ది చేకూరే విధంగా చేస్తారో చూస్తామన్నారు. ఈ జిల్లాకు రావలసిన నిధులన్నీ రాబట్టే విధంగా పోరాటం చేయాలని సూచించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రాబోయే వేసవిలో మంచినీటి కొరత రాకుండా చూడాలని తారకరామ త్రాగునీరు ప్రాజెక్ట్ కి సంబంధించి గత జగన్ ప్రభుత్వం చాలావరకు పనులు పూర్తి చేసిందని మిగిలినవి త్వరగా పూర్తిచేసి జిల్లాకు రాబోయే వేసవిలో మంచినీటి కొరత లేకుండా చూడాలని సూచించారు.జిల్లాలో కూటమి ప్రభుత్వం ఫలానా కార్యక్రమం చేసిందని చెప్పుకోలేని స్థితిలో ప్రజా ప్రతినిధులు ఉన్నారని విమర్శించారు. ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా కష్టాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్నారు. అధికార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని.. అధికారులందరూ కూడా ఎవరు పనులువారు చేయలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు.. సూపర్ సిక్స్ హామీలతో ప్రజలందరినీ మోసం చేశారని ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేని స్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నదని.. పెన్షనర్లు అయితే మరి భయాందోళనలో ఉంటున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అదేవిధంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకులైన బొత్స సత్యనారాయణ నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున పోరాడుతామని.. ప్రజలకు రావాల్సిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో
వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి కె.వి సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడు బాబు , గంట్యాడ జడ్పిటిసి వర్రీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.(Story : కూటమి ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా తయారయింది)