చెత్త సేకరణపై అవగాహన
న్యూస్ తెలుగు / వినుకొండ : గౌరవ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ మరియు శ్రీయుత జిల్లా గ్రామ పంచాయతీ అధికారి పల్నాడు మరియు శ్రీయుత ఎంపిడిఓ, వినుకొండ వారి ఆదేశాల ప్రకారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర స్పెషల్ డ్రైవ్ భాగంగా ఆదివారం వినుకొండ మండలం చీకటి గల పాలెం గ్రామ పంచాయతీలో చెత్త ప్రతి రోజూ వచ్చుచున్నందున సదరు చెత్తను సేకరించి, చెత్త నుండి సంపద తయారు కేంద్రం షెడ్ మిత్ర అక్కడే ఉండి గ్రీన్ డబ్బాలో వచ్చిన తడి చెత్తను వేల్లో ఎల్లో డబ్బాల వచ్చినప్పుడు చెత్తను సూదులు ఇంజక్షన్లు ఇనుము పెంకులు గాజు పెంకులు సీసాలు ఎర్ర డబ్బాల్లో వచ్చిన వాటిని వేరు చేస్తారని గ్రామస్తులు తడి చెత్త,పొడి చెత్త వేరు వేరుగా చెత్త హరిత రాయబారులకు అందించాలని, తడి చెత్త నుండి వర్మే కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు, తద్వారా వచ్చిన సంపదను పంచాయతీకి జమ చేస్తారని , గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఇన్చార్జి ఇవో పి అండ్ ఆర్ డి వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ మండల కోఆర్డినేటర్ ప్రభాకర్ రావు, పంచాయతీ కార్యదర్శి బి.ఏ.కే. జిలాని క్లాప్ మిత్రు లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. (Story : చెత్త సేకరణపై అవగాహన)