Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వరికెపూడి సెల నిర్మాణంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

వరికెపూడి సెల నిర్మాణంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

వరికెపూడి సెల నిర్మాణంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

న్యూస్ తెలుగు / వినుకొండ : వరికెపూడి సెల ప్రాజెక్టు నిర్మాణానికి రానున్న అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ కేటాయించి పనులు మొదలు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వినుకొండ లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో శనివారం పిడిఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. రానున్న అసెంబ్లీ సమావేశాలలో వరికెపూడిసెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వంపై అందరూ ఒత్తిడి తేవాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ. 70 ఏళ్లకు పైగా దొమ్మర్ల గొంది లిఫ్ట్ ఇరిగేషన్ కోసం, తదుపరి వరికపూడి సెల ప్రాజెక్టు కోసం బొల్లాపల్లి, ఎగువు పల్నాడు ప్రజలు పోరాడుతున్నారని, కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీల ముఖ్యమంత్రులు శంకుస్థాపన మాత్రమే చేశారని పనులు మొదలు పెట్టలేదని, ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఎన్నికల అప్పుడే మాట్లాడటం రాజకీయ ప్రయోజన పొందటమే అధికార ప్రతిపక్ష పార్టీలకు మొదటినుండి అలవాటేనని అలాంటి విధానాలు ప్రస్తుత పాలకులు మానుకొని ఈనెల 28న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ సమావేశంలో వరికపూడి సెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టేలా ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి చేయాలని కోరారు. ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీ .కోట నాయక్ మాట్లాడుతూ. బొల్లాపల్లి మండలం తాగునీరు, సాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని, ఈ ప్రాజెక్టు నిర్మాణం కావడం వలన పుల్లలచెరువు, వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి తదితర మండలాల ప్రజలకి ఉపయోగముందని తక్షణమే బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈనెల 28 న జరిగే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వరికిపూడిసెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు వెంటనే మొదలు పెట్టాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు వచ్చి మద్దతు ప్రకటించారు . ఈ కార్యక్రమంలో ,సిపిఐ ఎంఎల్ రైతు సంఘం నాయకులు తోట ఆంజనేయులు, న్యాయవాది సిఎన్ఎల్ మూర్తి ,న్యాయవాది లూకా, వైయస్సార్ పార్టీ అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రూబెన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వీరాంజనేయులు, నంగారా బేరి సంఘం నాయకులు ఆర్ కృష్ణ నాయక్, వరికపూడిసెల సంఘం ప్రధాన కార్యదర్శి రాంజీ నాయక్, సిఐటియు జిల్లా అధ్యక్షులు కే హనుమంత్ రెడ్డి, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు రెడ్డి బోయిన ప్రసన్నకుమార్ ,సిపిఎం పార్టీ నాయకులు బొంకూరు వెంకటేశ్వర్లు, గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు బి శ్రీను నాయక్, కార్మిక సంఘం నాయకులు ఎస్కే ఫిరోజ్, మాల మహానాడు నాయకులు బొందలపాటి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొని ప్రసంగించారు. (Story : వరికెపూడి సెల నిర్మాణంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!