“ప్రశంసలు అందుకున్న పల్లెటూరి ప్రతిభ”
న్యూస్ తెలుగు /వినుకొండ : పావస్ , జస్టిస్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన వినుకొండ వాసవి హైస్కూల్ లో జరిగిన ”చిత్రకళా పండుగ” లో వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన గండికోట బాజీ ఎంతో సహజంగా గీసిన ” కోడిపుంజు” చిత్రానికి ప్రత్యేక ప్రశంశలు లభించాయి, ఒక ప్రక్క కూలీ పనులు చేస్తూ.. ప్రముఖ చిత్రకారుడు డా వజ్రగిరి జెస్టిస్ ప్రోత్సాహంతో గత కొన్ని సంవత్సరాలుగా చిత్రాలు గీస్తున్న బాజీ గీసిన ఈ చిత్రం గుంటూరు లో జరిగిన జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో జ్యురీ అవార్డుకు సెలెక్ట్ అయింది.
పల్లెటూరికి చెందిన పేద కళాకారుని వినుకొండ ప్రముఖులు, వినుకొండ మున్సిపల్ చైర్మపర్సన్ సతీమణి షకీలా దస్తగిరి, ప్రముఖ న్యాయవాది పి.జె.లూకా, డా వజ్రగిరి జెస్టిస్, టీచర్ ఒంగోలు బ్యూలా, మద్దు వెంకటస్వామి, మాతంగి సాంబశివరావు, మాస్టర్ కేశవ సూరి,కవి కరీముల్లా,పావస్ చిత్రకారులు బాజీ ని అభినందించారు. భవిష్యత్తులో గొప్ప అవార్డులు అందుకోవాలని అభిలాష వ్యక్తం చేశారు. (Story : “ప్రశంసలు అందుకున్న పల్లెటూరి ప్రతిభ”)