Homeకెరీర్‌నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం-2025 నోటిఫికేషన్ జారీ
10 లక్షల మంది నిరుద్యోగుల‌కు ఉపాధి అవ‌కాశం
టాప్‌ 500 కంపెనీల ఎంపిక

న్యూస్‌ తెలుగు/అమరావతి: కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా నిరుద్యోగుల కలలు సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా పదో తరగతి నుంచి పట్టభద్రుల వరకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో..వారి కోసం ప్రతిష్టాత్మకమైన కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌కు ద్వారాలు తెరిచింది. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం-2025 కింద ఈ ఏడాదికి దేశ యువతకు దాదాపు లక్ష ఇంటర్న్‌షిప్‌లు అందించనుంది. దేశంలోని టాప్‌ 500 కంపెనీలతో ఏడాది పాటు ఈ ఇంటర్న్‌షిప్‌లకు మార్గం ఏర్పాటు చేసింది. ఇలా మొత్తం ఐదేళ్లలో పది లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌లను అందించనుంది. ఇప్పటికే పట్టభద్రులు డిగ్రీలు పూర్తి చేసి..సాంకేతిక అంశాలతో కూడిన అనుబంధ కోర్సులు అభ్యసించి ఇంటర్న్‌షిప్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వారంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో నిరుద్యోగం నుంచి దూరమవుతారు. ఎన్నికల్లో ప్రధాని మోదీ..నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలో భాగంగా ఈ తరహా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుంది.

21-24 ఏళ్ల మధ్య యువత అర్హులు

పీఎం ఇంటర్న్‌షిప్‌-2025 నిబంధన ప్రకారం 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దూరవిద్యతో పాటు పదో తరగతి పాసైన అభ్యర్థులతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్‌, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు పూర్తి చేసిన వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం రూ.8 లక్షలు దాటిన కుటుంబాలకు చెందినవారితో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన ఈ ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థులు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం-2025 వెబ్‌సైట్‌లోకి వెళ్లి..వారి మొబైల్‌ నంబరును నమోదు చేసి దరఖాస్తు చేయాలి. ప్రతి విద్యార్థి మూడు ఇంటర్న్‌షిప్‌ అవకాశాల్ని ఎంచుకోవచ్చు. పీఎం ఇంటర్న్‌షిప్‌ వెబ్‌సైట్‌లోకి ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లను దేశంలోని రాష్ట్రాల ఇంటర్న్‌షిప్‌, జిల్లా ఇంటర్న్‌షిప్‌లను ఇలా..ఆయా రంగాల్లో విద్యార్థులు చదువులకు అనుగుణంగా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకునేలా అవకాశమిచ్చారు. ప్రతి ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌, కంపెనీ పేరు, లోగో, వ్యాపార రంగ వివరాలను అందుబాటులో ఉంచారు. ఇంటర్న్‌షిప్‌ కాలంలో కంపెనీలు ఇచ్చే పారితోషికం, తదితర రాయితీల వివరాలను అక్కడ వెల్లడిస్తాయి. ఒక్కసారి ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకుని, సమయం ముగిశాక..వాటి చేర్పులు, మార్పులకు అవకాశం ఉండదు.

ఈ ఏడాది లక్ష మందికి అవకాశం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం-2025 కింద దేశ యువతకు కొత్త నైపుణ్యాలు బోధించి..ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్లలో 10లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌లను అందించనుంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాదికి ఇప్పటికే పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమ‌య్యాయి. 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాల కోసం యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్‌లోని టాప్‌ కంపెనీల్లో రిలయెన్స్‌ ఇండస్ట్రీ, టాటా కన్సల్టెన్సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ నేషనల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీఎస్‌, టాటా స్టీల్‌, ఐటీఎస్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, విప్రో తదితర టాప్‌ కంపెనీల్లో ఈ ఏడాదికి లక్షకుపైగా ఇంటర్న్‌షిప్‌లను అందించనుంది. మార్చి 12, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తొలుత తమ పేర్లను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని, ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి రుసుం లేదు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ https://pminternship.mca.gov.in/ క్లిక్ చేయండి. (Story: నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!)

Follow the Stories:

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!