జాతరెల్లి పొదామో జాతరో జాతర!
మన్యం కొండ జాతరకు ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రాలో గిరిజనులకు పెద్ద పండుగ
దేవతల ప్రాణ ప్రతిష్ట, పుణ్యస్నానాలకు జనం ఆరాటం
ఆంధ్రాలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి
న్యూస్ తెలుగు/చింతూరు: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పరిధిలో పొల్లూరు జలపాతం వద్ద ఒడిశా, ఆంధ్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతి రెండేళ్లు ఒకసారి అధికారికంగా మన్యం కొండ (పెద్ద పండుగ) జాతరను నిర్వహిస్తుంది. అయితే అప్పటికే నెల రోజులు పాటు ఒడిశాలోని ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్చి మూడున ఒక్క రోజు జాతరను ఆంధ్రాలోని చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పోల్లూరు జలపాతం వద్ద మన్యంకొండ జాతర జరుపుతారు.ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా మన్యం కొండ గ్రామంలో ఉన్న గిరిజన వనదేవతలు కన్నమరాజు (శ్రీకృష్ణుడు), బాలరాజు (అర్జునుడు), పోతురాజు భీముడు సాహిత్ ముత్యాలమ్మ తల్లి ఘటం ధ్వజాల రూపంలో పూజలు అందుకుంటుంది. వీటిని ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. అయితే ఈ కార్యక్రమాన్ని మోతుగూడెం వద్ద ఉన్న పొల్లూరు జలపాతం వద్ద నిర్వహించడం ఆచారం… మార్చి 3న మన్యం కొండ జాతర వనదేవతలకు గిరిజనుల పూజలు పొల్లూరు జలపాతం వద్ద జరుగుతాయి. ఇక మంగళ స్నానం, ప్రాణ ప్రతిష్ట అభయారణ్యంలో శోభాయాత్ర హైలైట్‌గా నిలుస్తాయి. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నండటంతో జాతరకి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒడిశా మన్యం కొండ జాతరను తిలకరించడానికి వేరే రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో మన్యం కొండకు చేరుకుంటారు. ఒడిశాలోని మన్యం కొండలో ఫిబ్రవరి 11న ప్రారంభమైన ఈ జాతర మార్చి 12 తేదీ వరకు కొనసాగుతుంది. పొల్లూరు జలపాతం వద్ద మార్చి 3న ప్రధానమైన మంగళ స్నానం, ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి రూపం లేకుండా ఉన్న ముత్యాలమ్మ తల్లి ఘటం ధ్వజం రూపంలో ఉన్న సోదరులు (కన్నమరాజు, బాలరాజు, పోతురాజు) తో కలిసి మన్యం కొండ చేరుకుంటారు. అదే సమయంలో మోటు బ్లాక్‌లో ఉన్న నడవనపల్లి గ్రామంలో నుంచి పూజారులు గద్వాల కోసం కొత్త వెదురులను తీసుకొని మన్యం కొండకు వస్తారు. కొండ గుహలు ఉన్న మూల రూపాలకు ప్రత్యేక పూజలు చేసి బోయ యాత్రకు బయలుదేరుతారు. ఈ యాత్రకు వేలాదిగా గిరిజన భక్తులు కాళ్లుకు చెప్పులు లేకుండా కొండ కోనలు ఎక్కుతూ, వాగులు వంకలు దాటుతూ వనదేవతతో పాటు నడక సాగిస్తారు.
అంగరంగ వైభవంగా..
ఈ యాత్ర అంగరంగ వైభవంగా, సాంప్రదాయం మేళ తాళాలు, దింసా నృత్యంతో సీలేరు నదికి ఆనుకుని ఉన్న ఒడిశాలోని అవతల పొల్లూరుకు మార్చి రెండున చేరుకుంటుంది. మార్చి మూడున ఉదయం పూజాది కార్యక్రమాలు ముగిసిన తరవాత కొత్తగా తయారు చేసిన ప్రత్యేక పడవల పైన మనదేవతలను నది దాటించి ఆంధ్రాలోని పొల్లూరు జలపాతం వద్దకు చేరుకుంటారు. అక్కడ వనదేవతలకు మంగళ స్నానం చేయించి పాత ధ్వజాలను నిర్వీర్యం చేసి కొత్త ధ్వజాలకు ప్రాణప్రతిష్ట చేసి భక్తుల దర్శించుకునేందుకు జలపాతం వద్ద ఉంచుతారు. అనంతరం లక్షల బలి పూజ చేసుకుంటారు. తిరిగి ప్రయాణమై మన్యం కొండకు చేరుకుంటారు. ఈ జాతరను వీక్షించడానికి సుమారు 20వేల మంది భక్తులు తరలివస్తారు. వారి కోసం వివిధ రకాల దుకాణాలు వెలుస్తాయి.
పుణ్య స్నానాలకు పోటీ
పొల్లూరు వద్దకు చేరుకొని వనదేవతలకు జలపాతం చెంతన ఉన్న గుహలో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలకు సంతృప్తి చెందిన ముత్యాలమ్మ జలపాతంలో బంగారు చేప రూపంలో పూజారులు, భక్తులకు దర్శనం ఇస్తారని నమ్మకం. వన దేవతలతో పాటు జలపాతంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. అనంతరం జలపాతం వద్ద ఉంచిన ఆసనంపై అలంకరించిన వనదేవతలను భక్తులు దర్శించుకుంటారు. ఈ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉంది. గిరిజనులు ఎంతో భక్తిప్రవత్తులతో దీన్ని నిర్వహిస్తారు. (Story: జాతరెల్లి పొదామో జాతరో జాతర!)
Follow the Stories:
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?