అత్యాచార నిందితులకు యావజ్జీవం
విజయవాడలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి మానభంగం చేసిన కేసు
విజయవాడ పోక్సో కోర్ట్ జడ్జి తీర్పు
మరణించేవరకు కఠినకారాగార శిక్ష, జరిమానా
న్యూస్‌తెలుగు/విజయవాడ: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి మానభంగం చేసిన కేసులో నిందితులకు మరణించే వరకు కఠినకారాగార శిక్ష మరియు జరిమానా విధిస్తూ విజయవాడ ఫోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలోని, మహిళా పోలీసు స్టేషన్ లో నమోదైన క్రైమ్ నెం: 227/2022 u/s 366(A),376(3),376-DA ఐపీసీ, sec 6 of పోక్సో యాక్ట్ కేసులో నిందితులైన సిరిగిరి చంద్ర శేఖర్ అలియాస్ సాయి (24 సం.), అనురాజ్ ప్రకాష్ అలియాస్ శ్రీను (23 సం.)లపై నేరం రుజువైనందున గురువారంనాడు విజయవాడ పోక్సో కోర్ట్ జడ్జి వి.భవాని నిందితులకు మరణించే వరకు కఠినకారాగార శిక్ష (జీవించినంత కాలం), అలాగే చంద్ర శేఖర్‌కు రూ.32,000, ప్రకాష్‌కు రూ.20,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఇటీవలకాలంలో విజయవాడలో వెలువడిన సంచలనాత్మక తీర్పు ఇదే కావడం విశేషం.
పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఫిర్యాది (మైనర్ బాలిక) తల్లిదండ్రులు చనిపోవడంతో తన తాత గారి ఇంటిలో నివసిస్తున్నది. ఇంటికి దగ్గరలోని స్కూల్ లో 8 వ తరగతి చదువుకున్న ఆమె 9వ తరగతి పెడన లోని స్కూల్లో ఉండి చదువుకుంటున్నది. పటమట లో చదువుతున్న సమయంలోనే సాయి అనే యువకుడు పరిచయమైనట్లు, ఈ క్రమంలో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటునట్లు తేలింది. 2022 మే నెలలో ఇంటికి వచ్చిన తరువాత రాత్రి సమయంలో సాయి ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పి, బయటకు తీసుకువెళ్లి బైక్ పై ఎక్కించుకుని స్కూల్ కి తీసుకు వెళ్ళి అక్కడ రూమ్ లో బలవంతంగా శరీరకంగా కలిసినట్లు రుజువైంది. ఆ తరువాత ఇంటి దగ్గర దించేశాడు. మరల రెండు రోజుల తరువాత సాయి బయటకు రమ్మని అడుగగా ఆమె రాను అని ఖరాఖండిగా చెప్పడంతో క్లాస్ రూమ్ లో ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలను అందరికి చూపిస్తాను అని భయపెట్టి మళ్లీ బయటకు తీసుకుపోయాడు. అయితే ఈసారి అక్కడ రూమ్ లో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు కూడా ఆ బాలిక ను బలవంతంగా మానభంగం చేసి ఎవరికైనా చెపితే చంపుతామని బెదిరించి ఇంటి దగ్గర దించేశారు. తరువాత జూన్ నెలలో స్కూల్ లో కి వెళ్ళిపోయింది. కొద్దిరోజుల తరువాత ఫిర్యాది వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్ళిన సమయంలో కడుపు ఎత్తుగా ఉందని వాళ్లు గమనించారు. దీంతో ఆ అమ్మాయి జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో ఈ విషయంపై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుపై మహిళా పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తు లో భాగంగా అప్పటి మహిళా పోలీసు స్టేషన్ ఏ.సి.పి. వి.వి.నాయుడుకు అందిన సమాచారం మేరకు వారి సిబ్బందితో కలిసి పటమట దర్శిపేట ఏరియాకు చెందిన సిరిగిరి చంద్ర శేఖర్ అలియాస్ సాయి (24 సం.)ని, పటమట లంబాడీ పేట ఏరియాకు చెందిన అనురాజ్ ప్రకాష్ అలియాస్ శ్రీను ( 23 సం.) లను, మరో జువైనల్ (బాల నేరస్తుడు)లను అదుపులోనికి తీసుకుని విచారించి అనంతరం అందులో సిరిగిరి చంద్ర శేఖర్, అనురాజ్ ప్రకాష్‌లను అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశపెట్టారు. అదుపులో ఉన్న జువైనల్ ను జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.
విచారణ అనంతరం నిందితులపై నేరం రుజువైనందున ది.20-02-2025వ తేదీన విజయవాడ పోక్సో కోర్ట్ జడ్జ్ వి.భవాని గారు నిందితులకు మరణించేంత వరకు కఠినకారాగార శిక్ష ( జీవించినంత కాలం) మరియు చంద్ర శేఖర్ అలియాస్ సాయికు రూ.32,000, ప్రకాష్ కు రూ.20,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదేవిధంగా బాధిత బాలికకు జరిమానా నుండి రూ.30,000 మరియు ఐదు లక్షల రూపాయలను నష్టపరిహారం వచ్చే విధంగా చూడవలసిందిగా డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ఆధారిటీ వారిని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వి. కృష్ణ వేణి, అప్పటి ఏ.సి.పి. వి.వి.నాయుడు, ప్రస్తుత మహిళా పి.ఎస్. ఏ.సి.పి. కె.లతాకుమారి, సి.యమ్.ఎస్. ఇన్‌స్పెక్టర్ పి.జగదీశ్వరరావు, సి. ఎం. ఎస్. సిబ్బంది పర్యవేక్షణలో 31 మంది సాక్షులను విచారించారు. (Story: అత్యాచార నిందితులకు యావజ్జీవం)
Follow the Stories:
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?