జీవన్ రావును పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : 22వ వార్డ్(బాలాజీ నగర్)నందు కార్పెంటర్ జీవన్ రావుకు సంబంధించిన గోదాం అగ్నిప్రమాదానికి గురై బాధితుడికి తీవ్ర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఫోన్ ద్వారా పరామర్శించడం , గురువారం
స్వయంగా ప్రమాదస్థలిని సందర్శించి ప్రమాదం జరిగిన విషయాలను అడిగి తెలుసుకొని విచారం వ్యక్తం చేశారు. జీవన్ రావు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వపరంగా వచ్చే నష్టపరిహారం కోసం కృషి చేస్తామని అండగా ఉంటామని మాజీ మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా వ్యాపారస్తులు ఖచ్చితంగా నష్ట పరిహారం కోసం భీమా కలిగివుండాలి మాజీ మంత్రి సూచించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్, నందిమల్ల.అశోక్,ప్రేమ్ నాథ్ రెడ్డి, జోహెబ్ హుస్సేన్,చిట్యాల.రాము, ప్రేమ్ కుమార్, గ్రీన్ యార్డ్ యూసఫ్,మూనేశ్వర్,శివ లక్ష్మణ్,తదితరులు ఉన్నారు. (Story : జీవన్ రావును పరామర్శించిన మాజీ మంత్రి )
