తొలి ప్రాధాన్య ఓట్లన్నీ ఆలపాటికే పడేలా కృషి చేయాలి
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు మద్దతుగా చీఫ్ విప్ జీవీ ప్రచారం
న్యూస్ తెలుగు / వినుకొండ : ఉమ్మడి కృష్ణా -గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో తొలి ప్రాధాన్య ఓట్లన్నీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కే పడేలా కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అందరికీ విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు ఓటువేసే సమయంలో… పీడీఎప్ అభ్యర్థిగా నిలిచిన లక్ష్మణరావు వెనక ఉన్నది ఎవరో గ్రహించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. వైకాపా ముసుగు రాజకీయాల్ని చేధించాల్సిన సమయం వచ్చిందని, ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారానే అది నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు కృష్ణా – గుంటూరు పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలి కోరుతూ గురువారం చీఫ్ విప్ జీవీ విస్తృత ప్రచారం చేశారు. వినుకొండ పట్టణంతో పాటు నూజెండ్ల, బొల్లాపల్లి, ఈపూరు మండల కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, పట్టభద్రులను కలిసి ఆలపాటికి ఓటు వేయాలని అభ్యర్థించారు. పట్టభద్రులు, ఉద్యోగులను ఆత్మీయంగా పలకరించి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయమ మీడియాతో మాట్లాడుతూ. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా కూటమి వైపు సానుకూలంగా ఉండడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి వెంకట్రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, గంగినేని అంజయ్య, భూపతి రావు, గంగినేని రాఘవ, ముండ్రు సుబ్బారావు, బచ్చు అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. (Story : తొలి ప్రాధాన్య ఓట్లన్నీ ఆలపాటికే పడేలా కృషి చేయాలి)