జేఎన్టీయూఈసీఈ ఆధ్వర్యంలో సాంకేతిక సదస్సు ప్రారంభం
న్యూస్‌తెలుగు/విజయనగరం : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, గురజాడ – విజయనగరంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల అంతర్జాతీయ సాంకేతిక సదస్సు బుధవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి అనేక మంది విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఇంచార్జి ప్రొఫెసర్ డి. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధిపై దృష్టి సాధించాలన్నారు. జ్ఞానం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. ఈ అంశంలో అబ్దుల్ కలాం మనకు గొప్ప ప్రేరణ” అని తెలిపారు.విశిష్ట అతిథిగా పాల్గొన్న పదవీ విరమణ పొందిన ఎన్ ఎస్ టి ఎల్ జి శాస్త్రవేత్త బి వి ఎస్ ఎస్. కృష్ణకుమార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాటిలైట్ కమ్యూనికేషన్, సెమీ-కండక్టర్స్ గురించి విశదీకరించారు. భవిష్యత్తులో చోటుచేసుకునే సాంకేతిక అభివృద్ధిని ముందుగా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం’ అని ఆయన పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రాజేశ్వరరావు విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ, విజయం సాధించేందుకు శ్రమ, అంకితభావం, నేర్చుకునే తత్వం ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు తమలో సృజనాత్మకత, ఆవిష్కరణ శక్తిపెంపొందించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగం హెచ్ ఓడీ డాక్టర్ టి ఎస్ ఎన్. మూర్తి , ప్రొఫెసర్లు కె. బాబులు , కే సి బి రావు గ డాక్టర్ గురునాథం, డాక్టర్ బి. నలిని , డాక్టర్ బి. హేమ, డాక్టర్ జి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు . (Story : జేఎన్టీయూఈసీఈ ఆధ్వర్యంలో సాంకేతిక సదస్సు ప్రారంభం)