సత్తుపాటి ప్రసన్న కు అభినందన
న్యూస్ తెలుగు/ సాలూరు : గిరిజన జాతుల భాషల లిపికర్త, నారీశక్తి అవార్డ్ గ్రహీత,నా సోదరి ఆంధ్రా యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డా. సత్తుపాటి.ప్రసన్న శ్రీ ఆధికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైనందుకు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర అన్నారు . ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ
ఆమె దృఢసంకల్పం మరియు న్యాయబద్ధమైన కోరిక ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా అత్యున్నత పదవికి ఆమె చేరుకుందని అన్నారు.వివిధ సమస్యలపై మీరు చేసిన కృషికి ఇది గొప్ప గౌరవమని,అలాగే మీ పని, సామర్థ్యం మరియు పరిపాలనా సామర్థ్యాన్ని మన ప్రజలకు చూపించడానికి ఇది గొప్ప ఆఫర్ అని తెలిపారు ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు . (Story : సత్తుపాటి ప్రసన్న కు అభినందన)