ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి సుతాపల్లి రాముని అరెస్ట్ చేయాలి
న్యూస్ తెలుగు /సాలూరు : దళితుల భూమి ఆక్రమించి వారిపై దాడి చేయించిన సుతాపల్లి రాముపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మర్రి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం సాలూరు పట్టణంలో గల సిఐటియు కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో ఉన్న దళితులకు పట్టాలు ఇవ్వాలని సుతాపల్లి రాము ఆక్రమించిన ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరపాలని అన్నారు దళితులు సాగు చేస్తున్న భూమిని కాజేయాలని దురుద్దేశంతో సుతాపల్లి రాము దౌర్జన్యం చేయడం జరిగింది అని అన్నారు. మిగిలిన గిరిజనులను దళితులపై దాడి చేయించడం భూములు ఉన్న చెట్లు నరికేయడం దళితులపై దాడి చేసి కొట్టడం జరిగిందని తెలిపారు. పై విషయాలన్నీ జిల్లా కలెక్టర్ సాలూరు మండల తాసిల్దార్
కి సాలూరు మండల పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఆందోళన పోరాటాల సందర్భంగా అధికారులు సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని హామీ ఇచ్చి రోజులు తరబడిన సమస్య పరిష్కారం చేయడంలో అధికారులు చిత్తశుద్ధి చూపడం లేదని తెలిపారు. దళితులపై గిరిజనులను ఎగదోసిన సుతాపల్లి రాముపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాలూరు పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య కులమునకు చెందిన నాగులు సన్యాసిరావు కి ఇచ్చిన పట్టాను రద్దు చేయాలని కోరారు. సుతాపల్లి రాము తన క్వారీ చుట్టూ ఉన్న దళిత గిరిజన పేదల ప్రభుత్వ భూములను ఆక్రమించేశారని అన్నారు. సుతాపల్లి రాము భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేసి ఆక్రమించిన ప్రభుత్వ భూములను పేదలకు పెంచాలని డిమాండ్ చేశారు. దళితులపై గిరిజనులను ఎగదోసి దాడి చేయించడం సరికాదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు సాగులో ఉన్న దళితులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. లేనియెడల ఆందోళన పోరాటాలకు సిద్ధపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు వంతల సుందర్రావు కరాసవలస దళితులు సలంబరికి సింహాచలం, బోడియ్యా, కోనవలస గౌరీష్, రామజన్ని సింహాచలం తదితరులు పాల్గొన్నారు. (Story :ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి సుతాపల్లి రాముని అరెస్ట్ చేయాలి)