కస్తూరిబా పాఠశాల ను సందర్శించిన
అల్లూరి జిల్లా ఏ పి సి
న్యూస్ తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు లోని కస్తూరిబా బాలికల పాఠశాలను జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ స్వామినాయుడు మంగళవారం సందర్శించారు.పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థినులకు భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని విద్యార్థినులకు అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా ఉదయం అల్పాహారం సమయంలో విద్యార్థినులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.అలాగే పెరిగిన పేర్కాప్ట్ ప్రకారం మెనూ పెడుతున్నారా లేదా అంటూ ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.అదే విదంగా పదవ తరగతి,ఇంటర్ విద్యార్థినులకు పరీక్షల పై అవగాహన కల్పించారు.సరైన మెళకువలు తెలిపారు.అలాగే పాల్ ల్యాబ్స్,అదనపు తరగతి గదులను గురుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.భోధన, బోధనేతర సిబ్బంది కి తగు సూచనలు చేశారు.కస్తూరిబా పాఠశాల ను అన్ని రంగాల్లో ముందుండేలా అందరూ కృషి చేయాలని సూచించారు. సందర్భంగా పాఠశాల ఆవరణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిణి రమాదేవి, ఉపాధ్యాయిని లు, సిబ్బంది పాల్గొన్నారు.(Story :కస్తూరిబా పాఠశాల ను సందర్శించిన అల్లూరి జిల్లా ఏ పి సి)