Homeవార్తలుతెలంగాణబీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించవలసిందే

బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించవలసిందే

బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించవలసిందే

న్యూస్‌తెలుగు/వనపర్తి :  ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో సూర్యారావు అధ్యక్షతన జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఉమ్మడి జిల్లా బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ బి.సి ఓట్లతో పబ్బం గడుపుకుంటున్న పాలకులు బీ.సీల పేరుతో మోసం చేస్తున్నారని బీసీల నిజమైన శాతాన్ని నిర్భయంగా ప్రకటించి చట్టసభలలో మాకు రావాల్సిన శాతాన్ని మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు రావాల్సిన సీట్లలో మీరు కూర్చున్నారు కనుక రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో పూర్తిస్థాయిలో మా సీట్లు మాకు ఇచ్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, లేనియెడల బాధ్యులను బీసీలు వెంటపడి ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా బీసీ నాయకులు శ్రీనివాస సాగర్, కొత్తగొల్ల శంకర్, లోక్సత్తా జిల్లా అధ్యక్షులు సూగూరు రాజ్ కుమార్, బొడ్డుపల్లి సతీష్, పుట్టపాక బాలు, పాషా, శివకుమార్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. (Story : బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించవలసిందే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!