Home టాప్‌స్టోరీ  ‘విశ్వంభర’ ఇంట్రో సాంగ్ షూటింగ్

 ‘విశ్వంభర’ ఇంట్రో సాంగ్ షూటింగ్

0

 ‘విశ్వంభర’ ఇంట్రో సాంగ్ షూటింగ్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదలైన తర్వాత హ్యుజ్ బజ్ క్రియేట్ చేసి, ఈ సినిమా కోసం రూపొందించిన మెస్మరైజింగ్ వరల్డ్ కోసం ఓ అవగాహన కల్పించింది. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా గ్రేట్ విజువల్ వండర్ గా రూపొందుతోంది.

సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తోంది, తాజా షెడ్యూల్ లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ హైదరాబాద్ లోని శంకర్ పల్లిలో ఒక అద్భుతమైన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్ ఓ మ్యాసీవ్ సెట్ ని రూపొందించారు.

ఎంఎం కీరవాణి ఈ పాట కోసం పవర్ ఫుల్ మాస్ అంథమ్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ డ్యాన్స్ మూమెంట్స్ ని పర్యవేక్షిస్తున్నారు.

సాంగ్ షూట్ నుంచి విడుదలైన ఇమేజ్ చిరంజీవిని కూల్ అండ్  స్టైలిష్ గా, షేడ్స్‌తో కారు దిగి షార్ఫ్ లుక్స్ తో ప్రజెంట్ చేస్తోంది.

బ్లాక్‌బస్టర్ బింబిసారతో అద్భుతమైన అరంగేట్రం చేసిన దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇది తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తాన్నారు. తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు, ఇది ఒక విజువల్ వండర్ అని హామీ ఇస్తోంది. అగ్రశ్రేణి VFX, హై-ఆక్టేన్ యాక్షన్, ఎమోషన్స్ ఆకట్టుకునే డ్రామాను బ్లెండ్ చేస్తోంది.

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు, కునాల్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా,  లెజెండరీ ఎంఎం కీరవాణి ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం సమకూరుస్తున్నారు.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో (Story :  ‘విశ్వంభర’ ఇంట్రో సాంగ్ షూటింగ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version