Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆర్టీసీ డిపో మేనేజర్ 

గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆర్టీసీ డిపో మేనేజర్ 

0

గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన

ఆర్టీసీ డిపో మేనేజర్ 

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాజి. నాగేశ్వరరావు వెల్లటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్దులకు పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ వారికి ఉన్నంతలో అనాథ వృద్దులను ఆదుకోవాలని, మానవత్వాన్ని కలిగి ఉండాలని కోరారు . వృద్ధాశ్రమంలో చెట్లు ఆహ్లాదాన్ని కలిగించాయని, పరిసరాల శుభ్రత ఆనందాన్ని కలిగించాయని, నా సహోద్యోగి గుమ్మడి వెంకటేశ్వర్లు సేవాభావాన్ని కలిగి ఉండటం డిపో మేనేజర్ గా నాకు గర్వకారమని అన్నారు. హుండీలో కొంత నగదు వేసి దాతృత్వాన్ని ప్రదర్శించారు. వృద్ధాశ్రమానికి వచ్చి తన సేవలను మెచ్చికొన్న డిపో మేనే జర్ జవ్వాజి. నాగేశ్వరరావు కు గుమ్మడి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. (Story : గుమ్మడి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆర్టీసీ డిపో మేనేజర్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version