18,19 లలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
న్యూస్‌తెలుగు/చింతూరు : ఈనెల 18,19 తేదీల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చింతూరు,రంపచోడవరంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు పాడేరు బ్రాంచ్ భాద్యులు ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షులు ఏ యస్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్, ఐ టీ డి ఏ పి ఒ, రెడ్ క్రాస్ చైర్మన్ అయిన డాక్టర్ అభిషేక్ గౌడ్, ఆదేశాల మేరకు 19వ తేదిన చింతూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో,18 వ తేదీ డిగ్రీ కాలేజీ లో యన్ యస్ యస్ సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. రక్తదాన శిబిరానికి యువకులు, ఔత్సాహికులు,పెద్ద ఎత్తున హాజరై రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలను విస్తృతంగా చేసేందుకు కార్యవర్గం ముందుకు సాగుతుందని ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, వైస్ చైర్మన్ గంగరాజు కార్యవర్గ సభ్యులు కోరారు. (Story : 18,19 లలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం)