సర్వ శిక్ష అభియాన్ కింద మంజూరు అయిన నిధుల ఖర్చు చేసిన నివేదికలు ఇవ్వాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాకు మంజూరు అయిన పి.యం శ్రీ (PMSRI) , సర్వ శిక్ష అభియాన్ కింద మంజూరు అయిన నిధులను ఫిబ్రవరి 20లోగా వంద శాతం ఖర్చు చేసిన నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సెక్రటరీ ఎడ్యుకేషన్ డా. యోగితా రాణా శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ ఏడ్యూకేషన్ డా .యోగిత రానా మాట్లాడుతూ పిఎం శ్రీ, సర్వ శిక్ష అభియాన్ కింద ప్రతి సంవత్సరం పాఠశాలల్లో మౌలిక వసతులు , క్షేత్రస్థాయి పరిశీలనల కొరకు విడతల వారీగా నిధులు విడుదల చేస్తుందని, కానీ చాలా జిల్లాలో 50 శాతం సైతం ఖర్చు చేయడం లేదని చెప్పారు. నిధులు ఖర్చు చేసి యూటిలైజేశన్ సర్టిఫికెట్ పంపిస్తే తిరిగి నిధులు విడుదల చేస్తారని తెలిపారు. అనంతరం కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తూ గ్రీన్ స్కూల్, ఆత్మ రక్షణ, క్షేత్ర స్థాయి పరిశీలన, మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్, సైన్స్ బడ్జెట్ తదితర విభాగాలకు లక్షల్లో నిధులు విడుదల చేయడం జరిగిందని వాటి ఖర్చులు మాత్రం జరగటం లేదన్నారు. ఫిబ్రవరి, 20 లోపు నిధులు అన్ని ఖర్చు చేయాలని యం. ఈ. ఓ లు, పి.యం. శ్రీ ప్రదానోపాధ్యాయులను ఆదేశించారు. పి.యం. శ్రీ కింద జిల్లాలో (6) ప్రాథమిక పాఠశాలలు, 15 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పి.యం శ్రీ పాఠశాలలు వారం రోజుల్లో నిధులు ఖర్చు చేసి నివేదిక ఇవ్వాలని, ఆపార్ నమోదు సైతం త్వరగా పూర్తి చేయాలని యం. ఈ. ఒ లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ ఘనీ, మండల విద్యా అధికారులు, పి.యం శ్రీ ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. (Story : సర్వ శిక్ష అభియాన్ కింద మంజూరు అయిన నిధుల ఖర్చు చేసిన నివేదికలు ఇవ్వాలి)