పెసా కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులకు శిక్షణ
చింతూరు (న్యూస్ తెలుగు): ఇటీవల చింతూరు మండలంలో ఎన్నికైన పెసా కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వార్డ్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్వయం సహాయక సభ్యులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ శిక్షణ ఉద్దేశించి ఎండిఓ పి జి రామకృష్ణ మాట్లాడుతూ గ్రామసభల ప్రాముఖ్యత గూర్చి తెలిపారు. గుంపెన పల్లి మోహన్ మాట్లాడుతూ గిరిజన చట్టాలను అమలు పరచడంలో శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవలం అమల, సామర్లకోట ఫ్యాకల్టీ ఆంజనేయులు, కోడేరు సర్పంచి సుబ్బలక్ష్మి, ఎంపిటిసి జల్లి లావణ్య, చదలవాడ సర్పంచ్ కుంజా తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. (Story: పెసా కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులకు శిక్షణ)