గ్రామీణ ప్రాంతాల్లో పశుసంతతి పెంచడమే లక్ష్యం
మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ముగిసిన పశు వైద్య శిబిరం
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గంలోని ఎంపిక చేసిన మూడు గ్రామాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాలను వనపర్తి శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు గురువారం వనపర్తి మండలం పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరైనట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు,ఇప్పటికే వనపర్తి నియోజకవర్గంలోని ఎంపిక చేసిన మూడు గ్రామాలలో ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రైతులకు ఉచిత మందుల తో పాటు ఉచిత చికిత్సలు నిర్వహించడం జరిగిందని అంతరించిపోతున్న పశుసంవర్ధక శాఖను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలలో పశు సంతతి పెంచుకోవడానికి రైతుల అవగాహన కల్పిస్తూ రైతులను ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం రైతు ప్రభుత్వంగా రైతుల కోసం పరితపిస్తూ పని చేస్తుందని అన్నారు, ఈ పశువైద్య శిబిరాలు గ్రామాలలో రైతులకు ఎంతో దోహదపడుతున్నాయని పశువులు వ్యవసాయానికి వెన్ను దండుగా నిలుస్తున్నాయని అన్నారు, అలాంటి పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సందర్భంగా అన్నారు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఒకపక్క మార్కెట్ యార్డ్ కు ధాన్యాన్ని తరలిస్తున్న రైతులకు గిట్టుబాటు ధరతోపాటు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ యార్డ్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పశు సమర్ధక శాఖ జెయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి కిరణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శారద, గోపాల్ నాయక్, శాంతన్న వివిధ గ్రామాల ప్రజలు పెద్దగూడెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ గ్రామ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెట్టగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వనపర్తి నియోజకవర్గ ప్రజలకు రైతులకు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.(Story : గ్రామీణ ప్రాంతాల్లో పశుసంతతి పెంచడమే లక్ష్యం )