జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల ర్యాలీ
న్యూస్‌తెలుగు/చింతూరు: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి15 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా చింతూరులో సోమవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెల్లారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రంపేటలోని ఎంవిఐ కార్యాలయం నుండి చింతూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టాటా మ్యాజిక్ లు, ఆటోల ఓనర్లు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెల్లారావు మాట్లాడుతూ డ్రైవర్లు విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని, నిర్దేశించిన స్పీడ్ లోనే వాహనాలు నడపాలని కోరారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని నడిపితే అలా భారీ జరిమానాలు అధికారులు విధిస్తారని అన్నారు. పరిమితి మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించే అలవాటు మానుకోవాలని సూచించారు. లారీలలో ఓవర్ లోడ్ వేయరాదని జరిమానాలు వేయించకుండా పరిమితిలోనే లోడు ఉండేలా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెల్లారావు, లారీ ఓనర్స్ అసోసియేషన్, సభ్యులు, మ్యాజిక్ ఓనర్లు, ఆటో ఓనర్లు, కాలేజీ విద్యార్థులు, భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. (Story: జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల ర్యాలీ)